మహిళా మెడలో గొలుసు కొట్టేయబోయి బుక్కైన చైన్ స్నాచర్...!

నల్లగొండ జిల్లా:మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును కొట్టేయబోయిన ఓ దొంగ అడ్డంగా బుక్కైన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పటణంలో గురువారం ఉదయం వెలుగు చూసింది.

పట్టణంలోని శాంతినగర్ చెందిన మేకల లీలమ్మ (60)అనే వృద్ధురాలు ఇంటి నుండి బయటకు వెళ్తుండగా ఆమె మెడలో ఉన్న 4 తులాల గొలుసు చోరీకి ప్రయత్నించగా వెంటనే స్పందించిన ఆ వృద్ధురాలు గొలుసు గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతోచుట్టు పక్కల ఉన్నవారు అక్కడికి చేరుకొని ఆ దొంగను పట్టుకొని టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.

వృద్ధురాలు ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

తాజా వార్తలు