సింగిల్ ఛార్జింగ్ తో 50 సంవత్సరాలు పనిచేసే బ్యాటరీ.. ఛార్జింగ్ సమస్యలకు చెక్..!

ప్రపంచం టెక్నాలజీ పరంగా రోజురోజుకు ఎంతలా అభివృద్ధి చెందుతుందో మనందరికీ తెలిసిందే.టెక్నాలజీ( Technology ) పరంగా పనిచేసే గ్యాడ్జెట్లు బ్యాటరీ సహాయంతో పని చేస్తున్నాయి.

అయితే ఈ గ్యాడ్జెట్లకు ప్రతి ఒకటి లేదా రెండు రోజులకు కచ్చితంగా చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది.ఇదంతా మనందరికీ తెలిసిందే.

అయితే ఈ చార్జింగ్ సమస్యలకు పెట్టేందుకు ప్రముఖ స్టార్టప్ సంస్థ బీటావోల్ట్ సింగిల్ చార్జింగ్ ( Betavolt single charging )తో 50 సంవత్సరాల పాటు పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.

చైనాకు( china ) చెందిన ఈ బీటా వోల్ట్ సంస్థ అటామిక్ బ్యాటరీని( Atomic battery ) అభివృద్ధి చేసేందుకు పూనుకుంది.BV 100 పేరుతో ఒక అటామిక్ బ్యాటరీని అభివృద్ధి చేస్తోంది.ఈ బ్యాటరీ గురించి బీటా వోల్డ్ సంస్థ మాట్లాడుతూ.

Advertisement

ఈ అటామిక్ బ్యాటరీ సైజ్ ఒక కాయిన్ కంటే చిన్నగా ఉంటుందని తెలిపింది.ఈ బ్యాటరీ 63 న్యూక్లియర్ ఐసోటోప్ లను కలిగి ఉంటుందట.

నికెల్ 63 ఐసోటోప్, డైమండ్ సెమీ కండక్టర్ లతో ప్రత్యేకంగా దీనిని రూపొందిస్తున్నారు.ఈ బ్యాటరీ 3V వద్ద 100 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం ఈ బ్యాటరీ పరీక్షల దశలో ఉంది.

ఈ బ్యాటరీ అంతరిక్ష నౌకలు, ఎరోస్పేస్, మైక్రో రోబోలు చిన్న డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాలలో ఉపయోగిస్తారు.ఈ బ్యాటరీ అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత 2025 నాటికి ఒక వాట్ ఉత్పత్తి చేసే లక్ష్యంగా బీటా వోల్డ్ సంస్థ పనిచేస్తోంది.మరి ఈ బ్యాటరీలు స్మార్ట్ ఫోన్లో ఉపయోగించవచ్చా లేదా అనే దానిపై సంస్థ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

కానీ ఎక్కువ సమయం బ్యాటరీ లైఫ్ ఇచ్చే విధంగా బ్యాటరీలను తయారు చేయడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది బీటా వోల్డ్ సంస్థ.

Advertisement

తాజా వార్తలు