4 సెకన్ల వ్యవధిలోనే గిన్నిస్ రికార్డుల్లో సత్తా చాటిన 9 ఏళ్ల బాలుడు!

అవును.మీరు విన్నది నిజమే.

కేవలం నాలుగంటే నాలుగు సెకన్ల వ్యవధిలోనే 9 ఏళ్ల చైనీస్ బాలుడు గిన్నిస్ రికార్డుల్లో సత్తా చాటాడు.

కేవలం 4 సెకన్లలోపు రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

మార్చి 12న మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన యోంగ్ జున్ కేయల్( Yong Jun Kayal ) స్పీడ్‌ క్యూబింగ్ 2023 పోటీ సెమీ ఫైనల్ లో యిహెంగ్ ఈ కొత్త రికార్డును నెలకొల్పి డ్రాగన్ కంట్రీకి గర్వకారణంగా నిలిచాడు.అతని వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా ఇపుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రూబిక్స్ క్యూబ్‌ను( Rubiks Cube ) పరిష్కరించడం అంత తేలికైన విషయం కాదని మనందరికీ తెలిసినదే.దీన్ని పరిష్కరించడానికి కొందరికి చాలా సమయం పడుతుంది.అలాంటిది ఈ 9 ఏళ్ల చైనీస్ కుర్రాడు దీనిని అవలీలగా సాధిస్తాడు.ఇకపోతే 4.86 సెకన్ల వ్యవధిలో రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించిన ఘనత గతంలో అమెరికాకు చెందినటువంటి మాక్స్ పార్క్( Max Park ) పేరిట ఉండగా ఇపుడు దానిని మనోడు చెరిపేసాడు.రూబిక్స్ క్యూబ్‌ 5 పరిష్కారాలను వాంగ్ వరుసగా 4.35, 3.90, 4.41, 5.31, 6.16 సెకన్లలో పూర్తి చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Advertisement

కాగా దీనికి సంబంధించినటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం వలన యిహెంగ్( Yiheng ) పేరు ప్రపంచమంతటా మారుమ్రోగిపోతోంది.ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.ఇంత చిన్న వయస్సులో ఇంత త్వరగా రూబిక్స్ క్యూబ్‌ ను పరిష్కరించడం నిజంగా అద్భుతం అని కొంతమంది కామెంట్ చేస్తే నేను చైనీస్‌ని.

కానీ UKలో పెరిగాను.నేను కూడా క్యూబర్‌ని.అయితే యిహెంగ్ అంతటి టాలెంట్ నాకు లేదని ఒప్పుకుంటాను అని ఒకరు కామెంట్ చేశారు.

అంతేకాకుండా అనేకమంది.యిహెంగ్ లాగ మేముకూడా త్వరగా రూబిక్స్ క్యూబ్‌ ను పరిష్కరించడానికి ట్రై చేస్తామని కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?
Advertisement

తాజా వార్తలు