అక్క.. అక్క... అని పిలుస్తూ ఇంటికి వస్తూ చివరకి అక్కని...

ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ క్లాసులు నెపంతో చిన్నపిల్లలకి స్మార్ట్ ఫోన్స్ చేతికి ఇవ్వడంతో కొందరు పిల్లలు సోషల్ మీడియాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

కాగా తాజాగా ఓ యువతి తన పక్కింట్లో ఉన్న చిన్న పిల్లాడికి నమ్మి సెల్ ఫోన్ ఇవ్వడంతో చివరికి ఆ పిల్లాడు చేసిన ఘనకార్యానికి చిక్కుల్లో పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిసర ప్రాంతంలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.కాగా గత కొద్ది కాలంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో యువతి ఇంటి పట్టునే ఉంటూ ఆన్ లైన్ క్లాసులకి హాజరవుతోంది.

ఈ క్రమంలో తన పక్కన ఇంట్లో ఉన్నటువంటి ఓ 14 సంవత్సరాలు కలిగిన బాలుడు తరచూ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు.దీంతో యువతి కూడా ఆ బాలుడితో బాగానే చనువుగా ఉండేది.

ఈ క్రమంలో అప్పుడప్పుడూ బాలుడు వీడియో గేమ్స్ ఆడే నెపంతో యువతి సెల్ ఫోన్ ని ఉపయోగించేవాడు.దాంతో ఆ యువతి కూడా చిన్న పిల్లాడు కదా అని తన సెల్ ఫోన్ పాస్ వర్డ్ కూడా ఇచ్చింది.

9th Class Boy Misusing Cell Phone And Doing Abuse Chat In Social Media, 9th Clas
Advertisement
9th Class Boy Misusing Cell Phone And Doing Abuse Chat In Social Media, 9th Clas

దీంతో కొద్ది రోజుల తర్వాత బాలుడు యువతి సోషల్ మీడియా మాధ్యమాలను ఓపెన్ చేస్తూ అసభ్యకర ఫోటోలు మరియు సందేశాలను పంపుతూ యువతి గురించి తప్పుడు ప్రచారాలు చేయడం చేయసాగాడు.దీంతో యువతి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించగా వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారాన్ని అందించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు యువతి ఫోన్ నుంచి అసభ్యకర సందేశాలు ఫోటోలు ఎలా బయటకు వెళుతున్నాయనే విషయంపై ఆరా తీశారు.

ఈ క్రమంలో బాలుడు గురించి చర్చ రావడంతో బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలుడు అంగీకరించాడు.దీంతో వెంటనే పోలీసులు బాలుడిని కస్టడీలోకి తీసుకుని ప్రభుత్వం సంక్షేమ బాలుర కార్యాలయానికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు