గ్రీన్‌ ఎనర్జీ హబ్‌ కోసం పనిచేయనున్న 9 యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు.. విశేషాలివే!

అవును, 9 యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు( 9 European Union countries ) మధ్యధరా ప్రాంతంలో గ్రీన్‌ ఎనర్జీ హబ్‌ కోసం ఓ ప్రతిపాదనను ప్రవేశ పెట్టడం జరిగింది.

ఈ నేపథ్యంలో గ్రీస్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, స్పెయిన్‌, సాల్వేనియా, క్రొయేషియా, సైప్రస్‌, మాల్టాలు ఎంఇడి 9 కూటమిగా ఏర్పడడం జరిగింది.

మాల్టా రాజధాని వలెట్టాలో గురువారం జరిగిన సమావేశంలో ఈ 9 దేశాల విద్యుత్‌ మంత్రులు ఉమ్మడి ప్రతిపాదనపై సంతకం చేయడం జరిగింది.ఈ కూటమి ప్రస్తుతం మీడియా సర్కిల్ లో హాట్ టాపిక్ అవుతుంది.

ఈ కూటమి లక్ష్యం ఏమంటే, దక్షిణ యూరప్‌( Southern Europe ) ప్రాంతంలో పునరుత్పాదక విద్యుత్‌ కోసం పెట్టుబడులను ప్రోత్సహించడం, తద్వారా వృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ 9 దేశాలు ఉమ్మడిగా పనిచేయనున్నాయి.ఈ కూటమి పునరుత్పాదక ఇంధన వనరులు, పునరుత్పాదక హైడ్రోజన్‌ ఉత్పత్తి, సౌర విద్యుత్‌ (పివి) వ్యవస్థలు, రవాణా, నిల్వ చేపట్టనున్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌( European Union ) (ఇయు) దేశాలతో పాటు ఇయులోకి రాని మధ్యధరా దేశాలకు సంబంధాలను ఏర్పరచనుంది.

ఈ నేపథ్యంలో.ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి మాల్టాలోని పర్యావరణం, ఇంధనం మంత్రి అయినటువంటి మిరియం డల్లి అధ్యక్షత వహించారు.ఇక ఈ కార్యక్రమంనికి ఇయు ఎనర్జీ కమిషనర్‌ కూడా హాజరయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా మిరియం డల్లి( Miriam Dally ) మాట్లాడుతూ."పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పాదకత కోసం పెట్టుబడులు వంటి దీర్ఘకాల లక్ష్యాలతో ముందుకు సాగడమే ధ్యేయంగా, ప్రస్తుత సవాళ్లకు ఉత్తమ పరిష్కారంగా భావించాలి.

" అని ఈ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు