పకోడీ వాలాకి 60 లక్షల టాక్స్ !

ఏదో చిన్న కొట్లో పకోడీ అమ్మడం మొదలు పెట్టారు.అక్కడ రుచి శుచి బాగుండడంతో బాగా ఫెమస్ అయిపొయింది.

ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ పకోడీ కోసం క్యూ కట్టేస్తున్నారు జనం.ఇంకేముంది ఆ షాప్ పేరు మారు మోగిపోయింది.పంజాబ్‌లోని లూథియానాలో 1952లో చిన్న వీధి కొట్టుగా మొదలైన ఆ కుటుంబ పకోడీ వ్యాపారం ఇంతింతై.

పకోడీ ఇంతై అన్నట్టుగా సాగింది.

మరి ఇంత ఆదాయం వస్తున్నా ఆ షాపు యజమాని పన్నా సింగ్‌ పకోడీవాలా ఇప్పటి వరకూ అతి తక్కువ పన్ను చెల్లించాడు.ఇంత పెద్ద వ్యాపారానికి అంత తక్కువ పన్ను ఏంటా అని అనుమానం వచ్చి అధికారులు మొత్తం రికార్డులు పరిశీలిస్తే.పన్నాసింగ్‌ భారీగా పన్ను ఎగ్గొడుతున్నట్టుగా తేలింది.దీంతో ఉన్న పళంగా, అతడితో రూ.60 లక్షలు పన్ను కట్టించారు.పకోడీ షాప్ లో సేల్స్ ఆ రేంజ్ లో ఉందన్నమాట.

Advertisement
ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట
Advertisement