భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.
సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.
కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.తాజాగా కెనడాలోని అంటారియో ప్రావిన్షియల్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 20 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.
మొత్తం 123 స్థానాలకు గాను జూన్ 2న పోలింగ్ జరిగింది.దేశంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన లిబరల్స్, నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ), ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ (పీసీ)లు దక్షిణాసియా ప్రజలను, పంజాబీలను టార్గెట్ చేస్తూ ఆయా జాతులకు చెందిన వారినే అభ్యర్ధులుగా నిలబెట్టాయి.
ఈ ఎన్నికల్లో పీసీ పార్టీకి చెందిన ఆరుగురు ఇండో కెనడియన్లు అంటారియో ప్రావిన్షియల్ లెజిస్లేచర్‌కు ఎన్నికయ్యారు.వీరంతా కూడా పంజాబీ సంతతికి చెందిన వారే కావడం విశేషం.
బ్రాంప్టన్ ఈస్ట్ రైడింగ్ (నియోజకవర్గం)లో ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ (పీసీ) అభ్యర్ధి హర్దీప్ గ్రేవాల్ చేతిలో ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్ సోదరుడు గుర్రతన్ సింగ్ ఓడిపోయారు.గ్రేవాల్ రాజకీయాల్లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చి.
తొలి ప్రయత్నంలోనే సంచలన విజయం సాధించి, ప్రావిన్షియల్ పార్లమెంట్‌లో తొలిసారి అడుగుపెడుతున్నారు.ఇక గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నినా టాంగ్రీ.మిస్సిసాగా- స్ట్రీట్స్‌విల్లే నుంచి తిరిగి ఎన్నికయ్యారు.2019లో అసోసియేట్ మంత్రిగా నియమితుడై.2021లో ట్రెజరీ బోర్డు అధ్యక్షుడిగా క్యాబినెట్ ర్యాంక్ పొందిన ప్రభమీత్ సర్కారియా సైతం బ్రాంప్టన్ సౌత్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు.మరో మంత్రి పర్మ్ గిల్ కూడా టొరంటో శివార్లలోని మిల్టన్ స్థానాన్ని నిలుపుకున్నారు.
ప్రస్తుతం ఆర్ధిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా, 2018 నుంచి ప్రావిన్షియల్ పార్లమెంట్ సిట్టింగ్ సభ్యుడిగా వున్న అమర్‌జోత్ సంధు బ్రాంప్టన్ వెస్ట్‌లో మరోసారి గెలుపొందారు.మిస్సిసాగా- మాల్టన్ రైడింగ్ నుంచి దీపక్ ఆనంద్ ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy