వన్‌ప్లస్ నుంచి 55 అంగుళాల టీవీ లాంచ్.. ధర ఎంత తక్కువో తెలిస్తే!

భారతదేశంలో స్మార్ట్ టీవీల సంఖ్యను వన్‌ప్లస్ కంపెనీ ఎప్పటికప్పుడు పెంచేస్తోంది.ఇందులో భాగంగా తాజాగా 55-అంగుళాల స్క్రీన్‌తో Y1S ప్రో 4K టీవీని విడుదల చేసింది.

ఈ స్మార్ట్ టీవీ 230+ లైవ్ ఛానెల్‌లు, 24 వాట్ ఆడియో అవుట్‌పుట్ యాక్సెస్‌తో పాటు వన్‌ప్లస్ కనెక్ట్ 2.0, ఆక్సిజన్‌ప్లే 2.0 వంటి ఫీచర్లతో భారత యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.వన్‌ప్లస్ TV 55 Y1S Pro స్మార్ట్ టీవీ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది.55 అంగుళాల డిస్‌ప్లే టీవీ ఇంత తక్కువ ధరలో, అది కూడా వన్‌ప్లస్ బ్రాండెడ్ కంపెనీ నుంచి రావడం నిజంగా విశేషమని చెప్పవచ్చు.వన్‌ప్లస్ టీవీ 55 Y1S ప్రో డిసెంబర్ 13 నుంచి కొనుగోలు చేయవచ్చు.ఈ టీవీ OnePlus.in, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా, వన్‌ప్లస్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పాటు క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలతో రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ప్రకటించింది.అలానే సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్‌లతో టీవీ కొనుగోలుపై కంపెనీ 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందిస్తోంది.

వన్‌ప్లస్ Y1S ప్రో 55-అంగుళాల స్మార్ట్ టీవీ 4K యూహెచ్‌డీ ఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది.HDR10+ డీకోడింగ్, HDR10, HLG ఫార్మాట్‌ల వంటి డిస్‌ప్లే ఫీచర్‌లతో వస్తుంది.ఆటో లో లేటెన్సీ మోడ్ (ALLM), MEMCలకు సపోర్ట్ కూడా దీనిలో అందించారు.

ఆడియో కోసం, 24 వాట్ల ఆడియో అవుట్‌పుట్‌, డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీ ఆఫీసర్.స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 10 ఆధారంగా ఆక్సిజన్‌ప్లే 2.0పై రన్ అవుతుంది.దీనిలో గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్స్ కూడా వాడుకోవచ్చు.64-బిట్ మీడియాటెక్ MT9216 ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్+ 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయింది.ఇంకా దీనిలో మరెన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు అందించారు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!
Advertisement

తాజా వార్తలు