విషాదం : కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

విదేశాల్లో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడటంతో పాటు కన్నవారికి, పుట్టిన దేశానికి పేరు తీసుకురావాలని ఎంతో మంది యువత కలలుగంటున్న సంగతి తెలిసిందే.

కానీ అనుకోని ఆపదల కారణంగా మన విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.

తాజాగా కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.వివరాల్లోకి వెళితే.

ఒంటారియోలో శనివారం ఉదయం హైవే-401పై ప్యాసింజర్‌ వ్యాన్‌లో భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.ఆ సమయంలో ఓ ట్రాక్టర్‌.

వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మరణించగా మరో ఇద్దరు గాయపడినట్లుగా కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా పేర్కొన్నారు.

Advertisement

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విద్యార్థుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణించిన విద్యార్ధులను హర్‌ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కర్నాపాల్ సింగ్, మోహిత్ చౌహన్, పవన్ కుమార్‌గా గుర్తించారు.

వీరంతా గ్రేటర్ టొరంటో, మాంటోరియల్ ప్రాంతంలో చదువుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనలో గాయపడ్డా మరో ఇద్దరు విద్యార్ధులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ మేరకు మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

అలాగే టొరంటోలోని భారత రాయబార కార్యాలయం అన్ని విధాలుగా అండగా వుంటుందని జయశంకర్ భరోసానిచ్చారు.మరోవైపు మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు.

ముఖంపై ఎలాంటి మ‌చ్చ‌లున్నా మాయం చేసే మ్యాజిక‌ల్‌ రెమెడీ మీకోసం!
Advertisement
" autoplay>

తాజా వార్తలు