వికలాంగులకు ₹4116 పెన్షన్.. వెయ్యి రూపాయలు పెంపు కేసీఆర్ కీలక ప్రకటన..!!

తెలంగాణ( Telangana )లో దివ్యాంగుల పెన్షన్ నీ వెయ్యి రూపాయలు పెంచుతూ మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ ₹4116కు పెరిగినట్లు అయింది.

ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.బీఆర్ఎస్( BRS party ) ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

యావత్ తెలంగాణ సమాజం బాగుండాలని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముసలమ్మలు, ముసలి తాతలు ఆసరా పెన్షన్ లతో సంతోషంగా ఉన్నారు.

వికలాంగులకు ₹3116 పెన్షన్ ఇస్తున్న.నేడు శుభదినం.తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ( TS Formation Day )జరుగుతున్నాయి.

Advertisement

ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నాం.మరో వెయ్యి రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేనే సస్పెన్షన్ లో పెట్టాను.పెంచిన పెన్షన్.

వచ్చే నెల నుంచి అందుతుంది.అందరి సంక్షేమం మంచి చూసుకుంటాం అంటూ కేసిఆర్ మంచిర్యాల సభలో భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ప్రకటన పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు