రూ.6 కోసం కక్కుర్తి.. 26 ఏళ్లుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు

బస్సుల్లో వెళ్తున్నప్పుడు ఒక్కోసారి కండక్టర్లు చిల్లర ఇవ్వరు.కొందరు ప్రయాణికులు పోనీలే అని పట్టించుకోరు.

అయితే కొందరు ప్రయాణికులు మాత్రం తమ చిల్లర ఇచ్చేంత వరకు వదిలిపెట్టరు.ఇదే కోవలో ఓ రైల్వే క్లర్క్( Railway Clerk ) టికెట్లు ఇచ్చాక చిల్లర ఇవ్వకుండా కక్కుర్తి పడ్డాడు.రూ.6 చిల్లర( Rs.6 Change ) ఇవ్వలేదని అతడిపై సస్పెన్షన్ వేటు పడింది.26 ఏళ్లుగా తిరిగి ఉద్యోగం పొందేందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్నా అతడికి ఉపశమనం లభించలేదు.అతడు చేసింది పూర్తిగా తప్పు అని కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి.

ముంబైలోని కుర్లా టెర్మినస్ జంక్షన్‌లో రైల్వే టికెటింగ్ క్లర్క్‌గా రాజేశ్ వర్మ( Rajesh Varma ) అనే వ్యక్తి పని చేసేవాడు.ప్రయాణికులకు చిల్లర ఇవ్వకుండా ఆయన తప్పించుకునే వాడు.

దీంతో ఒకసారి రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ ఒకరు డెకాయ్ తనిఖీలలో భాగంగా అక్కడకు వచ్చాడు.ప్రయాణికుడిలా ఫోజులు ఇచ్చి టికెట్ కొనుగోలు చేశాడు.రూ.214 టికెట్ ధర కాగా రూ.500ల నోటు ఇచ్చాడు.తిరిగి రూ.286లను ప్రయాణికుడికి క్లర్క్ రాజేష్ ఇవ్వాలి.కానీ రాజేష్ అలా చేయలేదు.కేవలం రూ.280 మాత్రమే ఇచ్చాడు.రూ.6లను తర్వాత ఎప్పుడైనా వచ్చి తీసుకోవాలని ప్రస్తుతం చిల్లర లేదని బదులిచ్చాడు.ఈ డెకాయ్ ఆపరేషన్ ఆగస్ట్ 30, 1997న జరిగింది.వచ్చింది విజిలెన్స్ తనిఖీల బృందం అని తెలియక రూ.6 కోసం రాజేష్ కక్కుర్తి పడ్డాడు.

26 Years On No Relief To Railway Clerk Who Did Not Return Rs 6 Change To Passeng
Advertisement
26 Years On No Relief To Railway Clerk Who Did Not Return Rs 6 Change To Passeng

రూ.6 ఇవ్వకపోవడంతో ఆ ఆర్‌పీఎఫ్ పోలీస్ లోపలికి వెళ్లాడు.రాజేష్ టేబుల్ వద్ద అధికారులతో కలిసి తనిఖీలు చేశాడు. రైల్వే టికెటింగ్‌కు( Railway Ticketing ) సంబంధించి రూ.58లు తేడా వచ్చాయి.అయితే ఆశ్చర్యకరంగా రాజేష్ వెనుక ఉన్న మరో అల్మరాలో తనిఖీ చేస్తే రూ.450లు కనిపించాయి.దీంతో ఇలా అక్రమంగా చిల్లర ఇవ్వకుండా ఆ డబ్బును అతడు వెనకేసుకుంటున్నాడని తేలింది.

26 Years On No Relief To Railway Clerk Who Did Not Return Rs 6 Change To Passeng

ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసి ఆ డబ్బు దాచుకుంటున్నాడని తేలింది.క్రమశిక్షణా విచారణ తర్వాత, జనవరి 31, 2002న వర్మ దోషిగా నిర్ధారించబడి, సర్వీసు నుండి తొలగించబడ్డాడు.వర్మ ఈ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేశారు, కానీ అతని అప్పీలు తిరస్కరించబడింది.

తాజాగా బొంబై హైకోర్టులో కూడా అతడికి చుక్కెదురు అయింది.ఆ చిల్లర ఉన్న అల్మరా అతడు మాత్రమే కాకుండా చాలా మంది వాడుతారని రాజేష్ తరుపు న్యాయవాది వాదించాడు.

కానీ కోర్టులు అతడి వాదనను అంగీకరించలేదు.

అజీర్తికి ఔషధం పుదీనా.. ఇలా తీసుకున్నారంటే క్షణాల్లో రిలీఫ్ మీ సొంతం!
Advertisement

తాజా వార్తలు