ఆ ఇంట్లో గుట్టల కొలది పాములు బుసలు కొడుతున్నాయి?

వర్షాకాలం కావడం చేత జనాలు ఎటువంటి ఇబ్బందులు పడతారు అనేది ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.

చిన్నపిల్లలు, ముసలి వాళ్లు ఈ కాలంలో రోగాల బారిన పడిన సందర్భాలు అనేకం ఉంటాయి.

అందుకే మరి ముఖ్యంగా ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.అవన్నీ ఒక ఎత్తు అయితే.

అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది.వాతావరణంలో ఎక్కడ చూసినా తేమ అధికం కావడంతో.

పాములు అడవి ప్రాంతాలను వదిలి జనావాసంలోకి పాక్కుంటూ వచ్చేస్తాయి.అందుకే జనాలు ఈ కాలంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది.

Advertisement

ఇక సర్పాల గురించి అనేక రకమైన వీడియోలు మీరు నిరంతరం సోషల్ మీడియా( Social media )లలో చూస్తూనే ఉంటారు.అయితే తాజా వీడియో చూస్తే.మీరు ఒకంత భయభ్రాంతులకు గురికావడం పరిపాటి అవుతుంది.

ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లోని బస్తీ జిల్లా పరిధిలోగల ఓ గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది.వర్షాకాలం కారణంగా.ఒక పాడుబడ్డ ఇంట్లో ఏకంగా 26 కొండచిలువలు( 26 Pythons ) బయటకు రావడంతో, స్థానికులు బెంబేలెత్తిపోయారు.

ఇలా పెద్ద సంఖ్యలో కొండచిలువలు ఒకసారిగా బయటకు రావడంతో ఊరు ఊరంతా భయభ్రాంతులకు గురయ్యారు.ఎట్టకేలకు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.

కొండచిలువలను రక్షించడానికి జెసిబిని ఏర్పాటు చేయడం జరిగింది.ఆ తర్వాత ఆ ఇంటిని తొలిచి చూడగా.

అన్నా క్యాంటీన్ల వివాదం... అడ్డంగా బుక్ అయిన మెగా హీరో...మామూలు ట్రోల్ కాదుగా!
వైరల్ వీడియో : ఏంటి భయ్యా.. కార్ పార్కింగ్ కోసం ఇంత లొల్లి అవసరమా.?

అక్కడ మరిన్ని కొండచిలువల పిల్లలు బయటపడ్డాయి.

Advertisement

ఇకపోతే ఈ విషయం జిల్లాలోని ఠాకూర్ ఆఫర్ గ్రామంలో చోటు చేసుకున్నట్టు సమాచారం.మొదట అక్కడ కురిసిన వర్షాలకి ఒక కొండచిలువ బయటకు రావడంతో స్థానికులు వెంటనే ఆ ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడం జరిగింది.దాంతో అతగాడు వచ్చి ఆ ఇంటి తలుపులు తెరవగానే గ్రామస్తులందరూ ఒక్కసారిగా అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ వెంటనే అటవీశాఖ బృందానికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు స్థానిక మీడియాతో చెప్పుకొచ్చారు.ఇక ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు వాటిని చాలా చాకచక్యంగా పట్టుకొని గోనె సంచుల్లో వేసిన తర్వాత అడవిలో వదిలేయడానికి తమ వెంట వాటిని తీసుకెళ్లారు.

తాజా వార్తలు