రెండు గ్రూపుల మధ్య కాల్పులు .. బస్టాప్‌లోకి దూసుకొచ్చిన బుల్లెట్, భారతీయ విద్యార్ధిని బలి

కెనడాలో( Canada ) దారుణం జరిగింది.21 ఏళ్ల భారతీయ విద్యార్ధినిని( Indian Student ) గుర్తుతెలియని అగంతకుడు కాల్చి చంపాడు.

బస్టాప్‌లో వేచి ఉండగా బాధితురాలిపై దుండగుడు కాల్చి చంపడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

మృతురాలిని హర్‌సిమ్రత్ రంధావాగా( Harsimrat Randhawa ) గుర్తించారు.ఈమె ఒంటారియోలోని( Ontario ) హామిల్టన్ మెహక్ కళాశాల విద్యార్ధిని.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భారతీయ విద్యార్ధిని మరణంపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ శుక్రవారం ఎక్స్‌లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.స్థానిక పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.

హర్‌సిమత్ర్ ఒక అమాయకురాలని అంటున్నారు.రెండు వాహనాలలో ఉన్న వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ బుల్లెట్ ఆమెకు తగలడంతోనే హర్‌సిమ్రత్ ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాము ఆమె కుటుంబంతో టచ్‌లోనే ఉన్నామని.అవసరమైన సహాయాన్ని అందిస్తామని పోలీసులు చెబుతున్నారు.స్థానిక సమయం ప్రకారం శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హామిల్టన్‌లోని( Hamilton ) అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వద్ద కాల్పులు జరిగినట్లుగా తమకు సమాచారం అందిందని హామిల్టన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసులు అక్కడికి చేరుకునేసరికి , ఛాతీపై తుపాకి గాయంతో రాంధావా కనిపించారని , ఆమెను ఆసుపత్రికి తరలించినా అప్పటికే హర్‌సిమ్రత్ ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు సేకరించిన వీడియోలో ఓ నల్లరంగు కారులోని ప్రయాణీకుడు తెల్లరంగు సెడాన్ కారులో ఉన్న వారిపై కాల్పులు జరిపాడు.కాల్పులు జరిగిన కొద్దిసేపటికే వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయని తెలిపారు.ఈ బుల్లెట్లు అక్కడికి దగ్గరిలోని నివాసం వెనుక కిటికీలోకి కూడా దూసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

ఆ ఇంట్లోని వ్యక్తులు కిటికీకి కొన్ని అడుగుల దూరంలో టీవీ చూస్తున్నారని ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో రాత్రి 7.15 గంటల నుంచి 7.45 గంటల మధ్య డాష్‌క్యామ్.సెక్యూరిటీ ఫుటేజ్ ఉన్న ఎవరైనా తమను సంప్రదించి దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడే సమాచారాన్ని అందించాలని దర్యాప్తు అధికారులు కోరుతున్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

హర్‌సిమ్రత్ మరణంతో ఆమె స్వగ్రామం పంజాబ్‌లోని తర్న్ తరన్‌ జిల్లా గోయింద్వాల్ సాహిబ్‌లోని ధుండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు