వచ్చే సంక్రాంతి ఫుల్ ప్యాక్‌.. మరీ ఇంత టైట్ కి వచ్చిందేంటో!

టాలీవుడ్ లో సంక్రాంతికి ( Sankranti ) ఎక్కువగా సినిమా లు రావడం మనం చూస్తూనే ఉంటాం.ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టార్స్ సంక్రాంతి పై దృష్టి పెడుతున్నారు.

2023 సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య.వీర సింహా రెడ్డి సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

కనుక 2024 సంక్రాంతి కి భారీ ఎత్తున సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.మొదటగా ప్రభాస్ ప్రాజెక్ట్‌ కే ( Project K ) సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

అంతే కాకుండా హనుమాన్‌ సినిమా ను( HanuMan Movie ) కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇదే సమయంలో మహేష్ బాబు గుంటూరు కారం( Guntur Karam ) సినిమా ని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇదే కాకుండా ఈగల్‌ తో రవితేజ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఇక యాత్ర 2 సినిమా ను( Yatra 2 ) కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.

అంతే కాకుండా విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు.

ఇన్ని సినిమా లు సంక్రాంతికి విడుదల అంటే పరిస్థితి ఏంటో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.మరీ ఇన్ని సినిమా లు ఒకే సారి విడుదల అయితే పరిస్థితి ఏంటి అంటున్నారు.ఇందులో కొన్ని అయినా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

ముఖ్యంగా ప్రాజెక్ట్ కే సినిమా ను సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు లేవు అంటున్నారు.ఆ సినిమా వాయిదా పడినా కూడా సంక్రాంతి కి భారీ ఎత్తున సినిమా లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.2024 సంక్రాంతికి రాబోతున్న సినిమా ల్లో ఏ సినిమా విజేతగా నిలుస్తుందేమో చూడాలి.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు