2021లో అద్భుతాలు జరుగుతాయట..!

2020.ఈ సంవత్సరం ఏం అనుకోని ప్రారంభమయ్యిందో కానీ ఇన్నేళ్లు సక్రమంగా నడుస్తున్న ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చేసింది.

ప్రజలకు ప్రశాంతత, స్వేచ్ఛ లేకుండా మార్చేసింది.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా అన్ని ఆగిపోయాయి.

అలానే సినిమాలు కూడా ఆగిపోయాయి.కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.

ఇప్పటికి విడుదల అవ్వాల్సిన అద్భుతమైన సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి.ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కు క్రమంగా ఒక్కొక్కరు వ్యాక్సిన్ కనుకుంటూ వస్తున్నారు.

Advertisement

నెమ్మదిగా సాధారణ రోజులు వస్తున్నాయ్.దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆనందపడే విషయం ఒకటి వైరల్ అవుతుంది.

అది ఏంటంటే.కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఆగిపోయిన షూటింగ్ లు అన్ని ప్రారంభం అవ్వనున్నాయని.

వచ్చే ఏడాది బోలెడు సినిమాలు విడుదల అవుతాయని కొన్ని మిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వచ్చే ఏడాది.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, మహేష్ బాబు సర్కారు వారి పాట, అల్లు అర్జున్ పుష్ప, చిరంజీవి ఆచార్య, బాలకృష్ణ సినిమా, నాగార్జున వైల్డ్ డాగ్, వెంకటేష్ నారప్ప, రవి తేజ క్రాక్ సినిమాలు థియేటర్ లలో విడుదలయ్యి అద్భుతాలు సృష్టిస్తాయని.2021 అంత ఓ సినిమా పండుగ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.మరి మీరు ఏం అంటారు?.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు