Ap elections : ఏపీలో ఏ పార్టీ గెలిచినా 100 స్థానాలను మించి కష్టమేనా.. 2009 నాటి పరిస్థితులే అంటూ?

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి.2014, 2019 ఎన్నికల పరిస్థితులకు 2024 ఎన్నికల పరిస్థితులకు చాలా తేడా ఉంది.

తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు.

కొన్ని సర్వేలు కూటమికి, మరికొన్ని సర్వేలు వైసీపీకి( YCP ) అనుకూలంగా ఉన్నప్పటికీ చాలా సంస్థలు సర్వేలు చేయకుండానే ఫలితాలు ప్రకటించాయనే ఆరోపణలు ఉన్నాయి.ఏపీలో అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ 88 కాగా 100 స్థానాలకు మించి విజయం సాధించడం ఏ పార్టీకి అయినా కష్టమని తెలుస్తోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు ఏపీలో అదే తరహా పరిస్థితి ఉంది.2004 నుంచి 2009 వరకు ఎన్నో సంక్షేమ పథకాలను రాజశేఖర్ రెడ్డి( Rajasekhar Reddy ) అమలు చేసినా 2009లో అప్పటి కాంగ్రెస్ కు మరీ అద్భుతమైన ఫలితాలు రాలేదు.

గతంలో చాలా సందర్భాల్లో టీడీపీకి( TDP ) పొత్తుల వల్ల మేలు జరిగితే ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ, జనసేనలకు నష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైసీపీ, 160 స్థానాల్లో విజయం సొంతమవుతుందని టీడీపీ చెబుతున్నా వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి.మూడు నుంచి నాలుగు స్థాయిల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయి.

ఏప్రిల్ లో ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్( Congress ), వైసీపీలకు అనుకూల ఫలితాలు రాగా మేలో ఎన్నికలు జరిగిన సమయంలో టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేక బ్రేక్ అవుతుందో చూడాల్సి ఉంది.ఎన్నికల్లో గెలుపు కోసం కొందరు నేతలు రోడ్డు పనులను ప్రారంభించడం ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తోంది.

Advertisement

ఏ పార్టీ హామీలు బాగుంటే ఆ పార్టీకి ఓటేస్తామని న్యూట్రల్ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.ఈసారి ఎన్నికల ఖర్చు కూడా భారీ స్థాయిలో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు