2వేల ఏండ్ల నాటి మ‌మ్మీ క‌డుపులో పిండం.. గుర్తించిన సైంటిస్టులు

ఈజిప్టు మ‌మ్మీలు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత ఫేమ‌స్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

వీటికి సంబంధించినంత వ‌ర‌కు ఏదో ఒక వార్త నెట్టింట్లో బాగా పాపుల‌ర్ అవుతూనే ఉంటుంది.

మొన్న‌టికి మొన్న ఓ మ‌మ్మీని ఇలాగే బ‌య‌ట‌కు తీస్తే ఆ వార్త కూడా బాగానే వైర‌ల్ అయిపోయింది.అయితే మ‌మ్మీల‌ను పూర్వ‌పు కాలంలో అన‌గా రాజుల కాలంలో ఆ ఈజిప్టు దేశంలోని సైనికులు పిర‌మిడ్ల రూపంలో చ‌నిపోయిన వారిని ఇలా పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఆ శ‌వాలు పాడైపోకుండా ఇలా అత్యంత నియ‌మ నిబంధ‌న‌లు పాటించి భ‌ద్ర ప‌రిచారు.కాగా ఇప్పుడు కూడా ఓ మ‌మ్మీకి సంబంధించిన వార్త నెట్టింట్లో బాగా పాపుల‌ర్ అవుతోంది.

అయితే ఇంత వ‌ర‌కు మ‌మ్మీల గురించి, వారి శ‌రీరం మీద పాడై పోకుండా ఉన్న వ‌స్తువుల గురించి మాత్ర‌మే తెలుసుకున్నాం.మొద‌టిసారి ఓ మ‌మ్మీ క‌డుపులో ఉన్న పిండం బ‌య‌ట ప‌డింది.

Advertisement
2 Thousand Year Old Mummy In The Womb Of The Fetus Details, Old Mummy, Viral New

వార్సా యూనివ‌ర్సిటీ సైంటిస్టులు ఈ విష‌యాన్ని వివ‌రించారు.మ‌మ్మీని సీటీ ఎక్స్ రే స్కాన్‌ సాయంతో పూర్తిగా ప‌రిశీలించ‌గా.

అందులో ఉన్న పుట్టబోయే బిడ్డ అవశేషాలు బ‌య‌ట ప‌డ్డాయి.వాటిని చాలా క్లియ‌ర్ గా గుర్తించామ‌ని ఆయ‌న వివ‌రించారు.

2 Thousand Year Old Mummy In The Womb Of The Fetus Details, Old Mummy, Viral New

అయితే ఈ మ‌మ్మీ తాను 20 ఏళ్ల వయసులో ఉన్న‌ప్పుడు చనిపోయింద‌ని వెల్ల‌డించారు.దీనికి మిస్టిరియస్ లేడీ అని పేరు పెట్టారు.కాగా ఆ మహిళ ప్రసవ స‌మ‌యంలో చ‌నిపోలేదని, అంత‌కు ముందే చ‌నిపోయిన‌ట్టు వెల్ల‌డించారు.

కార‌ణాలు ఏమో తెలియ‌ట్లేద‌ని, ఇక ఆ మ‌మ్మీ స‌మాధి కూడా పూర్తిగా శిథిలమైంద‌న్నారు.ఇక ఆమె క‌డుపులో ఉన్న పిండం 30 వారాలు నిండిన‌ట్టు తెలుస్తోంది.కాగా మ‌మ్మీకి పూసిన అనేక ర‌సాయ‌నాల వ‌ల్ల ఆమె క‌డుపులో ఉన్న పిండం ఎము‌కలు చితికిపోయిన‌ట్టు తెలిపారు సైంటిస్టులు.

ప్రతిరోజూ 30నిమిషాలు నడిస్తే ఈ వ్యాధులకు చెక్

ఈ వార్త బాగా పాపుల‌ర్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు