Bhadra, okkadu: ఒకే కథతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన రెండు టాలీవుడ్ సినిమాలివే..

సాధారణంగా ఈ రోజుల్లో ఆల్రెడీ గతంలో వచ్చిన వేరే సినిమా స్టోరీలతో కొత్త సినిమా వస్తే దానిని ప్రేక్షకులు సింపుల్‌గా రిజెక్ట్ చేస్తారు.

రొటీన్ స్టోరీ అని కొట్టిపడేస్తూ దానిని ఫ్లాప్ చేస్తారు.

అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమానైనా కథలో ఏదైనా కొత్తగా ఆఫర్ చేసేది ఉంటేనే థియేటర్లకు వెళ్లి చూస్తారు.అయితే ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు.

ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టైన సినిమాల స్టోరీలతోనే మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.అయితే ఈ సినిమాలు కొంచెం అటు ఇటు మారిన కథలతో వచ్చి హిట్ అయ్యాయి.

ఉదాహరణకి భద్ర, ఒక్కడు( Bhadra, okkadu ) సినిమాలు దాదాపు సేమ్ కథతో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

2 Block Busters With Same Story
Advertisement
2 Block Busters With Same Story-Bhadra, Okkadu: ఒకే కథతో వచ�

అంతేకాదు, మంచు విష్ణు( Manchu Vishnu ) నటించిన ఢీ( Dhee ), అక్కినేని సుమంత్ యాక్ట్ చేసిన మహానంది సినిమాలు కూడా ఒకే కథతో వచ్చాయి.మహానంది( Mahanandi ) 2005లో రిలీజ్ కాగా ఢీ సినిమా 2007లో విడుదలైంది.మహానంది సినిమాలో సుమంత్, అనుష్క శెట్టి, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషించారు.

శ్రీహరి చెల్లెలుగా అనుష్క శెట్టి యాక్ట్ చేయగా.సుమంత్‌ అతని సన్నిహితుడిగా కనిపించాడు.

ఈ సినిమాలో సుమంత్ అనుష్కను లవ్ చేస్తాడు.శ్రీహరి డాన్‌గా ఉంటూ సిటీలో దాదాగిరి చేస్తాడు.

అయితే అతడిని చంపాలని ఇంకొక ఫ్యాక్షన్‌ గ్రూప్ లీడర్ ప్లాన్ చేస్తాడు.అతడిని ఎదుర్కొనేందుకు శ్రీహరితో సుమంత్ ( Sumanth )చేతులు కలుపుతాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

చివరికి వారిద్దరూ అతడిని ఓడించి చంపేస్తారు.ఆ తర్వాత సుమంత్ అనుష్కను పెళ్లి చేసుకుంటాడు.

Advertisement

అనుష్కతో కలిసి ఒక మగ బిడ్డకు జన్మ కూడా ఇస్తాడు.దాంతో కథ సమాప్తం అవుతుంది.

ఇక ఢీ సినిమాలో కూడా శ్రీహరి( Srihari ) డాన్ గా కనిపించాడు.అతని దగ్గర గుమాస్తాగా మంచు విష్ణు యాక్ట్ చేశాడు.శ్రీహరి చెల్లెలుగా హీరోయిన్ జెనీలియా కనిపించింది.

ఆమెను మంచు విష్ణు ప్రేమిస్తాడు.ఆమెను చంపాలని ప్లాన్ చేసే వారిని అతడు ఎదుర్కొంటాడు.

తన చెల్లెలను శత్రువుల నుంచి చాలా సార్లు కాపాడటంతో శ్రీహరి జెనీలియాని విష్ణుకు ఇచ్చి పెళ్లి చేస్తాడు.తర్వాత జెనీలియా ఒక బిడ్డకు జన్మనిస్తుంది.

దాంతో స్టోరీ సమాప్తం అవుతుంది.పైన చెప్పినట్లుగా ఈ రెండు సినిమాలు ఒకే స్టోరీ లైన్ తో వచ్చాయి.

కాకపోతే కామెడీ, సాంగ్స్, స్టోరీ చెప్పే విధానం డిఫరెంట్‌గా ఉంటాయి.ఈ కథతో వచ్చిన మహానంది మూవీ ఒక మోస్తారు హిట్ అందుకుంది.

అదే కథతో రెండు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఢీ మాత్రం సూపర్ హిట్ అయింది.

తాజా వార్తలు