ఛారిటి కోసం ఇంగ్లీష్ ఛానెల్‌లో సాహసం.. 16 ఏళ్ల భారత సంతతి బాలిక అరుదైన ఫీట్

భారత్ , యూకేలలో( India , UK ) చిన్నారుల ఆకలి తీర్చడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్ధ కోసం నిధులు సేకరించేందుకు 16 ఏళ్ల భారత సంతతి విద్యార్ధిని ఏకంగా ఇంగ్లీష్ ఛానెల్‌ను ఈది చరిత్ర సృష్టించింది.

ఉత్తర లండన్‌లోని బుషే మీడ్స్ స్కూల్‌లో చదువుకుంటున్న ప్రిషా తాప్రే( Prisha Thapre ) తనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లు ఇంగ్లీష్ ఛానెల్ గురించి మాట్లాడుకుంటుండగా తాను అందులో ఈదాలని నిర్ణయించుకుందట.

నాలుగేళ్ల శిక్షణ అనంతరం ఆమె గత వారం ఇంగ్లాండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్ గ్రిస్‌నెజ్( Cap Grisnez in France ) వరకు 34 కిలోమీటర్ల దూరాన్ని 11 గంటల 48 నిమిషాల్లో పూర్తి చేసింది.

ఈ ఫీట్‌పై ప్రీషా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఈతలో మొదటి రెండు గంటలు అత్యంత కష్టతరమన్నారు.తనకు మధ్యలో నిద్ర ముంచుకొచ్చి , కళ్లు మూత పడటం ప్రారంభమైందన్నారు.

అప్పుడే సూర్యుడు ఉదయించడంతో తన నిద్ర ఎగిరిపోయి, వాతావరణం నిర్మలంగా ఉందన్నారు.తన ఇంటికి సమీపంలోని సరస్సును ప్రశాంత ప్రదేశంగా అభివర్ణించే ప్రీషా.

Advertisement

ఏకాగ్రత కోసం చాలా మెడిటేషన్ పద్ధతులను( Meditation techniques ) వినియోగించినట్లు పేర్కొన్నారు.అలాగే స్విమ్ చేసే సమయంలో జెల్లీ ఫిష్ కుట్టిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు.

జెల్లీ ఫిష్ కుట్టడం తనకు ఇష్టమేనని.ఎందుకంటే దాదాపు 9 గంటల పాటు ఈతకొట్టిన తర్వాత, ఒక విధమైన ట్రాన్స్‌లో ఉంటామని.

అలాంటప్పుడు జెల్లీ ఫిష్ కుట్టడం ద్వారా తాను సజీవంగా ఉన్నానని అది గుర్తుచేసిందని ప్రీషా చెప్పారు.

మహారాష్ట్ర తల్లిదండ్రులకు యూకేలో జన్మించిన ప్రీషా.భారత్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు సంబంధించి బ్రిటీష్ చాప్టర్‌కు 3700 పౌండ్ల విరాళాల సేకరణే లక్ష్యంగా తాను ఇంగ్లీష్ ఛానెల్‌ను ఈదినట్లుగా ప్రీషా చెప్పారు.వాట్‌‌ఫోర్డ్ స్విమ్మింగ్ క్లబ్ సపోర్ట్‌తో కఠినమైన మిషన్‌ను పూర్తి చేసిన తాప్రే .ఈ నెలలో ప్రారంభంకానున్న పాఠశాల తరగతులపై దృష్టి పెట్టింది.

50కి పైగా దెయ్యాల కొంపలకు వెళ్లిన యూకే ఘోస్ట్ హంటర్.. చివరికి..?
Advertisement

తాజా వార్తలు