అతని సంపాదన గంటలో 16 వేల కోట్లు... ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?

ఎవరైనా ఒక గంటకు ఎంత సంపాదిస్తారు.? అనే ప్రశ్నకు వారి వారి వృత్తులను బట్టి 50 రూపాయల నుండి లక్షల రూపాయల వరకు సంపాదించే వారు ఎంతోమంది ఉన్నారు.

కానీ ఆ వ్యక్తి మాత్రం ఏకంగా ఇండియన్ కరెన్సీలో గంటకు 16,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

పూర్తి వివరాలలోకి వెళితే స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ సంపాదన ఒక గంటలోనే ఏకంగా 16,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. మార్కెట్లో టెస్లా కంపెనీ షేర్లు బలంగా ట్రేడ్ అవుతూ ఉండటంతో ఎలన్ మస్క్ సంపాదన ఈ రేంజులో పెరిగింది.

మోడల్ వై కాస్రోవర్ కారు యొక్క తయారీని వేగవంతం చేయడం వలన నిన్న ఈ కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి.కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపాదన ఏకంగా 2.3 బిలియన్ డాలర్లకు (16,000 కోట్ల రూపాయలు) పెరిగింది.బ్లూమ్ బెర్గ్ అంచనాల ప్రకారం ఎలన్ మస్క్ సంపద 36 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం. టెస్లాలో ఎలన్ మస్క్ కు ఐదో వంతు షేర్లు ఉండగా కొన్ని రోజుల క్రితమే ఈ కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు దాటేసింది.346 మిలియన్ డాలర్లు మస్క్ వాటా కాగా మూడో త్రైమాసిక ఫలితాల తరువాత ఈ కంపెనీ షేర్లు రెట్టింపు అయ్యాయి.2025 సంవత్సరం నాటికి ఈ కంపెనీ 30 లక్షల వాహనాలను విక్రయించనుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.మోడల్ వై తయారీ కారు కొరకు త్వరలో చైనాలో ప్లాంట్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో షేర్లు మార్కెట్లో బలంగా ట్రేడ్ అవుతూ ఎలన్ మస్క్ సంపద భారీగా పెరిగింది.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement