2022 ఫస్ట్ హాఫ్ కే సెంచరీ కొట్టేసిన టాలీవుడ్.. వివరాలు ఇవే!

2022 ఏడాది వచ్చి అప్పుడే సగం పూర్తి కూడా అయ్యింది.

ఏడాది సగం రోజులు గడిచి పోవడంతో ఈ ఆరు నెలలలో మన టాలీవుడ్ ఇండస్ట్రీ సాధించిన ఘనతలు ఏంటి.

ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.

అయితే ఈ కొత్త ఏడాదిలో టాలీవుడ్ మాత్రం కాస్త ఊపిరి పీల్చుకుంది.ఇక్కడ మన సినిమాలకు ప్రేక్షకుల నుండి ఆశాజనకమైన స్పందన లభించింది.

దీంతో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు అనువాద చిత్రాలు కలిపి మొత్తం 115 సినిమాలు రిలీజ్ అయినట్టు లెక్కలు వచ్చాయి.మరి ఈ సినిమాల్లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి.

Advertisement
115 Movies Released In Tollywood In First Half Of 2022 Bangarraju Rrr Dj Tillu B

మరికొన్ని మొదటి వారం వసూళ్లతో ఇంకొన్ని ఓపెనింగ్స్ తో కుమ్మేసాయి.సంక్రాంతికి బంగార్రాజు మాత్రమే సినిమా మాత్రమే సూపర్ హిట్ గా మిగిలింది.

మరి భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాలలో ఆర్ ఆర్ ఆర్ ఉంది.

115 Movies Released In Tollywood In First Half Of 2022 Bangarraju Rrr Dj Tillu B

రాధేశ్యామ్ మాత్రం అంచనాలు అంతగా అందుకోలేక పోయింది.ఆ తర్వాత డీజే టిల్లు, భీమ్లానాయక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించాయి.అలాగే డబ్బింగ్ సినిమాల్లో కేజిఎఫ్ 2 భారీ కలెక్షన్స్ రాబట్టింది.

115 Movies Released In Tollywood In First Half Of 2022 Bangarraju Rrr Dj Tillu B

ఆచార్య మెప్పించలేక పోగా.సర్కారు వారి పాట మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అలాగే ఎఫ్ 3 సినిమా కామెడీ తో ప్రేక్షకులను మెప్పించింది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఇలా ఇన్ని సినిమాలు బాగా మెప్పించి మంచి కలెక్షన్స్ రాబట్టగా కొన్ని సినిమాలు నిరాశ కలిగించాయి.విక్రమ్, మేజర్ సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ సాధించాయి.

Advertisement

అంటే సుందరానికి, విరాట పర్వం సినిమాలు పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం సాధించలేక పోయాయి.ఇలా మొత్తంగా 115 సినిమాలు రిలీజ్ అయ్యాయి.

తాజా వార్తలు