క్షమాపణలు చెప్పినా వదిలేదేలే.. శ్యామల, హర్షసాయిలకు భారీ షాక్ తగిలిందిగా!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకొని బెట్టింగ్ యాపులను( Betting Apps ) ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై ప్రభుత్వం కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే.

ఒక్కొక్కరికి చమటలు పట్టిస్తోంది.

ఇప్పటికే కొంతమంది పై కేసులు కూడా పెట్టిన విషయం తెలిసిందే.దీంతో ఒక్కొక్కరు గజగజ వణికిపోతున్నారు.

సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయ్యి అదే క్రేజ్ తో బెట్టింగ్ యాప్స్ ని బాగా ప్రమోట్ చేస్తూ బాగా చేతినిండా డబ్బులు సంపాదిస్తున్న వారి పేర్లను యూట్యూబర్ నా అన్వేషి బయట పెట్టడంతో విసి సజ్జనార్( VC Sajjanar ) ఒక్కొక్కరిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే.

11 Telugu Influencers Booked For Promoting Betting Apps Details, Betting Apps, S

అయితే ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.హర్ష సాయి పై కూడా కేసు నమోదు అయ్యింది.దీంతో ఒక్కొక్కరిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీడియా ముందుకు వచ్చి తప్పు చేసాము క్షమించండి ఇలాంటి యాప్స్ మళ్ళీ ప్రమోట్ చేయము అంటూ వేడుకుంటున్నారు.

Advertisement
11 Telugu Influencers Booked For Promoting Betting Apps Details, Betting Apps, S

కానీ బెట్టింగ్స్ యాప్ ప్రమోటర్స్ ని మాములుగా వదిలేలా లేరు.తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

11 Telugu Influencers Booked For Promoting Betting Apps Details, Betting Apps, S

ఆ 11 మందిలో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల,( Anchor Shyamala ) విష్ణుప్రియ,( Vishnu Priya ) సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసారట.అయితే ఇప్పటికే సుప్రీత, సురేఖ వాణి, రీతు చౌదరి లాంటి వారు క్షమించమని వేడుకున్నప్పటికీ పోలీసులు మాత్రం వీరిని వదిలిపెట్టేలా కనిపించడం లేదు.మరి ఈ విషయంపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.ఒకవేళ ఆమె బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఉంటే అధికారులు మాత్రం ఆమెపై కేసు నమోదు చేయడం ఖాయం అని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు