గుండు గీయించుకున్న ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.. అస్సలు గుర్తు పట్టలేమంటూ?

మాములుగా తరచూ సోషల్ మీడియాలో హీరో హీరోయిన్ లకు సంబందించిన ఫోటోస్,వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి.

అయితే అందులో కొన్ని రకాల ఫోటోలు వీడియోలు గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటాయి.

అలాంటి ఫోటోలు ప్రస్తుతం కొన్ని వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలలో ఒక హీరోయిన్( Heroine ) ఏకంగా గుండు చేయించుకొని కనిపించి షాక్ ఇచ్చింది.

మొదట ఆమెను చూసిన అభిమానులు ఎవరో అని అనుకున్నారు.కానీ కొద్దిసేపు అలాగే చూస్తే అప్పుడు అర్థమయ్యింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.పై ఫోటోలో కనిపిస్తున్న ఆమె ఎవరో గుర్తుపట్టారా? తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్‌. ఒకప్పుడు హీరోయిన్‌ గా, సహాయ నటిగా అలరించింది.

Advertisement

ఆవిడే శరణ్య( Sharanya ).కాదల్‌ కవితై( Kadal Kavitai ) సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది.నీ మనసు నాకు తెలుసు అనే తెలుగు చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది.

కాదల్‌ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఫేమస్‌ అవడంతో అప్పటి నుంచి కాదల్‌ శరణ్యగా ముద్రపడిపోయింది.

అలాగే ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా తదితర చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన శరణ్య 10th క్లాస్‌, పేరణ్మయి, మళైకాలం, రెట్టై వాలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.తాజాగా ఈమె తమిళనాడు తిరుత్తని లోని సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని గుండు గీయించుకుంది.అలాగే నాలుకపై శూలం పొడిపించుకుని మొక్కు చెల్లించుకుంది.

అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.అమ్మాయిలకు జుట్టు అంటే ఎంతో ఇష్టం.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

అలాంటిది తన కేశాలను భగవంతుడి కోసం త్యాగం చేసిందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు