మూత్రం పదే పదే వస్తోందా ? ఇదిగోండి 10 చిట్కాలు

రోజుకి నాలుగు నుంచి ఎనిమిది సార్లు ఒక మనిషి మూత్ర విసర్జన చేయాలి.అపుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఎందుకంటే మన ఒంట్లో ఉండే మలీన పదార్థాలు, టాక్సిన్స్ మూత్రం ద్వారానే బయటకి వస్తాయి.అందుకే నీళ్ళు బాగా తాగమని అంటారు.

నీళ్ళు బాగా తాగితే మూత్రం బాగా వస్తుంది.అప్పుడే శరీరం లోపలి నుంచి పరిశుభ్రంగా ఉంటుంది.

అలాగని మూత్రం మాటిమాటికి రాకూడదు.అలాంటి సమస్య మీకు ఉంటే దాన్నే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటారు.

Advertisement

అంటే మన మూత్రాన్ని స్టోర్ చేసే బ్లాడర్ అవసరానికి మించి పనిచేస్తోందన్న మాట.ఈ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.ఓ చోట సరిగా కూర్చోలేం, ఏ పని సరిగా చేయలేం, నలుగురిలో ఆ ఇబ్బంది మాటలకు అందదు.

అయితే కంగారోద్దు.ఈ సమస్యకు చికిత్స ఉంది.

ఇప్పుడైతే బయటపడేందుకు ఓ 10 మార్గాలను చూడండి .* కేఫైన్ డ్రింక్స్ ఎక్కువగా తాగొద్దు.

ద్రవ పదార్థాలు ఎంత తీసుకుంటున్నాం అనేది బాగా గమనించండి.మగవారైతే రోజుకి మూడున్నర లీటర్ల ద్రవపదార్థం తీసుకోవాలి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!

అదే ఆడవారైతే రెండున్నర లీటర్లు చాలు.ఏ లెక్క ఎక్కడైనా తప్పుతున్నారో చూడండి.

Advertisement

* పాలకూరని బాగా ఉడకబెట్టి తింటూ ఉండండి.ఇది పనిచేస్తుంది.

* కేగెల్ వ్యాయామాలు ఉంటాయి.అవి ఎలా చేయాలో మంచి ట్రైనర్ ని సంప్రదించి తెలుసుకోండి.

ఈ వ్యాయామాలు బ్లాడర్ పనితనాన్ని బ్యాలెన్స్ చేస్తాయి.* దానిమ్మ తొక్కను బాగా దంచండి.

దాన్ని ఓ పేస్టులా చ్సుసుకొని నీళ్ళు కలుపుకొని రోజుకి ఓసారి తీసుకోండి.ఇది బాగా పని చేసే చిట్కా.

* కలబంద రసం తీసుకోండి.ఇది కిడ్నీల పనితనాన్ని సరైన ట్రాక్ లో పెడుతుంది.

ద్రవం ఎందుకు అంటే కలబంద గుజ్జుని తినండి.* రోజు కొద్దిగా, లిమిట్ గా బెల్లం తినండి.

పెరుగు కూడా సపరేట్ గా తీసుకోండి.ఈ రెండు కిడ్నీల పనితనాన్ని మేరుగుపరిచేవే.

* అరటిపండ్లు, ఆపిల్, స్వీట్ పోటాటో, రాస్ప్ బెర్రీ.ఈ ఫలాలను తినండి.

నిమ్మరసం, ఆరెంజ్ రెగ్యులర్ గా తీసుకోండి.జామ కూడా తినండి.

* వైట్ రైస్ పక్కనబెట్టి, బ్రౌన్ రైస్ తినండి.షుగర్ లెవల్స్ పెంచే ఏ ఆహార పదార్థమైనా సరే, వదిలేయండి.

* స్కలనం తరువాత మూత్రం రావడం సహజం.ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరం చేసే నేచురల్ ప్రక్రియ ఇది.అధిక మూత్రం సమస్య ఉంటే హస్త్రప్రయోగం అలవాటు కొద్దిగా తగ్గించుకోండి.* Capsaisin, Corn silk, Ganoderma Lucidum మరియు కొన్ని Chinese herbs మీ సమస్యను పరీష్కరిస్తాయి.

అయితే వీటి ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావొచ్చు.ఎందుకైనా మంచిది డాక్టర్ ని ముందు సంప్రదించి ఈ మెడికేషన్ గురించి ఆలోచించండి.

తాజా వార్తలు