అపార్టుమెంట్ లో10 అడుగుల పాము.. రెండో అంతస్తులోకి ఎలా వెళ్లిందబ్బా?

పాములు అంటే చాలా మంది భయపడతారు.

పాములు వస్తాయని చాలా మంది ఇంటి ముందు కానీ పక్కన కానీ గుబురు పొదలు, గడ్డి లేకుండా చూస్కుంటూ ఉంటారు.

అంతేనా మరికొందరు అయితే మల్లె తీగలు కూడా పెంచరు.ఎక్కడ వాసనకు పాములు వచ్చేస్తాయోనన్న భయంతో.

10 Feet Long Python On The Second Floor On Haridwar , 10 Feet Long Python , Seco

అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో లేదా అండర్ గ్రౌండ్ లోనూ పాములు కనిపించడం చాలా సహజం.పక్కన చెట్లు, పొదలు ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసమే లేదు.

కానీ ఓ అపార్ట్ మెంట్ లోకి పాము వచ్చిందంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే, అందులోనూ ఆ పాము ఏ గ్రౌండ్ ఫ్లోర్ లోనో కాకుండా రెండో అంతస్తు వరకు వెళ్లిందంటే మామూలు విషయం కాదు.అయితే ఎరకి కంటా పడకుండా ఓ కొండ చిలువ అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తు వరకు వెళ్లింది.

Advertisement

ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్ లో చోటు చేసుకుంది.పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో 10 అడుగుల పైథాన్ కలకలం సృష్టించింది.

అపార్ట్ మెంట్ రెండో అంతస్తులోని ఓ ఇంటి బాల్కనీలోకి చొరబడి ఆ ఇంటి వాళ్లని భయభ్రాంతులకు గురి చేసింది.ఇది గమనించిన యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే రంగంలోకి దిగిన వాళ్లు.కొద్దిసేపు శ్రమించి పామును పట్టుకున్నారు.

అసలు ఆ పాము పైకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని తెలిపారు.స్థానికులు కూడా ఇంత పెద్ద పాము రెండో అంతస్తు వరకు ఎలా వచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే
Advertisement

తాజా వార్తలు