రావణుడు చనిపోయే ముందు లక్ష్మణుడితో ఆ ముగ్గురిని నమ్మవద్దని చెప్పాడా..

మన దేశంలో రావణ దహన కార్యక్రమం చాలా పద్ధతులలో చేస్తారు.అలాగే రావణాసుడు మరణించిన తర్వాతే రామాయణం ముగిసిందని చాలామందికి తెలుసు.

కానీ మరణించడానికి చివరి క్షణాల్లో ఉన్న రావణుడు తన వద్దకు వచ్చిన లక్ష్మణుడితో ఇలా చెబుతాడు.బ్రాహ్మణోత్తముడు, రాజు అయిన రావణుడు, లక్ష్మణుడికి ఏం చెప్పాడంటే.

రథ సారథితో, పాలవాడితో, వంటవాడితో, నీ సోదరులతో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి.వాళ్ళతో శతృత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎట్నుంచి అయినా మనకు హాని కలిగించే అవకాశం ఉంది.

ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తియ్యడానికి కూడా ఆలోచించరు.నీతో ఉంటూ నిన్న విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో, కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు.

Advertisement
Did Ravana Tell Lakshmana Before He Died Not To Trust Those Three Details, Ravan

ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోవద్దు.నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా అస్సలు వేయకూడదు.

నేను హనుమంతుడిని కోతే కదా అని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను.రాజు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ ఎప్పటికీ అత్యాశపరుడై ఉండకూడదు.

దేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు కానీ ఏదైనా కూడా అపారమైన ధృఢ నిశ్చయంతో చెయ్యాలి.ఇతరులకు, సైన్యానికి అవకాశం ఇచ్చి రాజు అలిసిపోకుండా పోరాడితేనే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.

Did Ravana Tell Lakshmana Before He Died Not To Trust Those Three Details, Ravan

ఈ విషయాలు లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు విడిచాడు రావణుడు.అయితే రావణుడు చెప్పిన మాటలు కేవలం పురాణాల్లోని వారికి మాత్రమే కాదు, ఈ తరానికి చెందిన పాలకులకు కూడా వర్తించే అవకాశం ఉంది.దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుతారు.

బట్టల మీద ఎలాంటి మరక పడిన ఈ విధంగా చేస్తే మళ్ళి కొత్త వాటిలాగా మెరుస్తాయి

దసరా రోజున రావణుని దిష్టి బొమ్మను తగులబెట్టడం వెనుకో ఎన్నో కథలు ఉన్నాయి.శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు.

Advertisement

శ్రీరాముడు రావణుడిపై దండెత్తి యుద్ధంలో విజయం సాధించిన రోజు కావడంతో రావణుని దిష్టి బొమ్మ దహనం చేస్తారు.

తాజా వార్తలు