మాజీమంత్రి వివేకా హత్య కేసు విచారణ ఈనెల 31కి వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

కేసులో నిందితుడిగా ఉన్న శివ శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు ఈనెల 31కి వాయిదా వేసింది ధర్మాసనం.

మరో నాలుగు పిటిషన్లు వేరే బెంచ్ ముందు పెండింగ్ లో ఉన్నట్లు వివేకా కుమార్తె సునీతా రెడ్డి తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారని తెలుస్తోంది.సంబంధం లేని విషయాలను బెయిల్ పిటిషన్ కు ముడిపెడుతున్నారని శివ శంకర్ రెడ్డి న్యాయవాది తెలిపారు.

Ex-minister Viveka's Murder Case Trial Adjourned To 31st Of This Month-మాజ

సునీత తరపు న్యాయవాది చెప్పనున్న వివరాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ సి.టి.రవికుమార్ వెల్లడించారు.అనంతరం తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.

నెలసరి సమయంలో కడుపు నొప్పి విపరీతంగా వస్తుందా.. అయితే ఈ డ్రింక్ ను మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు