కారు దిగి ఏనుగు ఎక్కిన ఉద్యమ యువ నేత

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని,తదనంతరం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసిన ఉద్యమకారులు పార్టీలో సరైన గుర్తింపు దక్కక ఎనిమిదేళ్ళ ఎదురు చూసి చివరికి ఒక్కరొక్కరు కారు దిగుతున్నారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్లకు చెందిన టీఆర్ఎస్ ఉద్యమ విద్యార్థి నాయకుడు రాపోలు నవీన్ పార్టీకి రాజీనామా చేసి,తన అనుచరులతో కలిసి సాయంత్రం రామన్నపేట మండలం సిరిపూరo గ్రామంలో రాజ్యాధికార యాత్ర చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సమక్షంలో నీలి కండువా కప్పుకున్నారు.బీఎస్పీ సుర్యాపేట జిల్లా ఇంచార్జ్,రాష్ట్ర కార్యదర్శి పిల్లుట్ల శ్రీనివాస్,హుజుర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ సాంబశివ గౌడ్ ల ఆద్వర్యంలో బీఎస్పీ లో చేరారు.

The Young Leader Of The Movement Got Out Of The Car And Rode The Elephant-కా

ఆయనకు బహుజన రాజ్యాధికార యాత్ర రథసారధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు