కరెంట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదా...?

సూర్యాపేట జిల్లా: ఇష్టానుసారంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్.చోద్యం చూస్తూ ఉండిపోతున్న విద్యుత్ శాఖ అధికారులు.

భయాందోళనలో గ్రామ ప్రజలు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు పల్లె పట్నం అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, విద్యుత్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని,ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కారం చూపాలని ఒకవైపు చెబుతుంటే,విద్యుత్ శాఖా మంత్రి ఇలాకా అయిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని తమ్మారం గ్రామంలో విద్యుత్ అధికారుల,ఆర్&ఆర్ కాంట్రాక్టర్ పని తీరు మాత్రం విచిత్రంగా ఉంది.

Isn’t The Current Contractor Negligence A Huge Value?-కరెంట్ క�

తమ్మారం గ్రామం పులిచింతల పునరావాస గ్రామంగా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచింది.అయినా ఇప్పటి వరకు ఈ గ్రామంలో విద్యుత్ సమస్యలు తీరలేదు.

కరెంట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మాణమవుతున్న విద్యుత్ ఏర్పాట్ల విషయంలో మూడు ట్రాన్స్ఫార్మర్ల లైన్లు ఓకే పోల్ పై ఏర్పాటు చేయడంతో,గ్రామంలో విద్యుత్ సమస్య ఏర్పడితే ఒక ట్రాన్స్ఫారం ఆఫ్ చేసి పని చేసే క్రమంలో వేరొక ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా అవుతుంది.దీని కారణంగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

అంతేకాకుండా అదే స్థంభంపై హెచ్ టి లైను ఏర్పాటు చేయడంతో స్థంభంపై ఉన్న వ్యక్తికి హెచ్ టి లైన్ ఒక మీటరు దూరంలోనే ఉంటుంది.ఏదైనా చిన్న తప్పిదం జరిగితే క్షణాల్లో కాలిపోయే అవకాశం ఉన్నది.

హెచ్ టి లైన్ ఎల్టి లైన్ కి అటాచ్ అయితే గ్రామంలో షాట్ సర్క్యూట్ వచ్చి,ఇండ్లలో ఉన్న ఫర్నిచర్ కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది.హెచ్ టి లైన్ సబ్ స్టేషన్ నుండి గ్రామ ప్రారంభ ట్రాన్స్ఫారం నందే ఆగాల్సి ఉండగా,ఓకే స్థంభంపై నాలుగు లైన్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్ కాంట్రాక్టర్ కి స్థంభాలు,కేబుల్ మిగులుతుందనే ఉద్దేశ్యంతో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారని తెలుస్తుంది.

ఇదే విషయమై గ్రామ సర్పంచ్ గడ్డం పద్మ మాట్లాడుతూ తమ్మారం గ్రామంలోని వివిధ వీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ల పరిస్థితి అత్యంత అపాయకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలోని ఆర్&ఆర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ స్థంభాలపై మూడు వరుసలు తీగలు ఏర్పాటు చేశారని,ఒక్కో లైన్ రిపేర్ చేయాలంటే ఒక్కో ట్రాన్స్ఫార్మర్స్ ఆపాల్సి వస్తుందని, అలా ఒక్క ట్రాన్స్ఫార్మర్స్ ఆపితే మరొకటి విద్యుత్ సరఫరా చేస్తుందని,అది చాలదన్నట్లు దానికే హెచ్ టి లైన్ వేశారని దాని వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నామని తెలిపారు.

మెయిన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆపితేనే ఇక్కడ సమస్య పరిష్కారానికి వీలు అవుతుందని,అట్లా చేయడం వలన గ్రామం మొత్తం కరెంట్ సరఫరా నిలిచిపోతుందని అన్నారు.అలాగే గ్రామంలో కొన్ని వీధుల్లో కరెంట్ స్థంభాలు వేసి,ఇంత వరకు తీగలు లాగకుండా వదిలేశారని,ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.

ఆర్ & ఆర్ లో కరెంట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ గ్రామం నిత్యం కరెంట్ తో చెలగాటమాడే పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు.ఓకే పోల్ కి ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ లైన్లు ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారైందన్నారు.

Advertisement

ఇప్పటికైనా జిల్లా విద్యుత్ శాఖా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

తాజా వార్తలు