ఒత్తిడిని తగ్గించే మార్గాలు ఇవే

ఒత్తిడి.పోటీ ప్రపంచలో ఇది సర్వసాధారణంగా వినిపించే మాట.

ఆర్ధికంగా,ఉద్యోగపరంగా అనేకరకాలైన సమస్యలతో అనునిత్యం మనిషికి ఎదురయ్యే సమస్య ఒత్తిడి.

ఈ ఒత్తిడిని నియంత్రించాలి అంటే మార్గం ఒక్కటే మెడిటేషన్.

How To Control Stress-ఒత్తిడిని తగ్గించే మ�

ఏదన్నా వెకేషన్ కి వెళ్ళడం.చాలా మంది ఒత్తిడిని దూరం చేసుకోవడానికి వేకేషన్లకి వెళుతారు.దీనివలన మనసుకి కోట ఊరట కలుగుతుంది.

అయితే మానసిక ఆరోగ్యం సరిగా ఉంటే ఎటువంటి సమస్యలని అయినా సరే ఎదుర్కునే శక్తి మనకి ఉంటుంది.మెడిటేషన్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి .ఒకటి మైండ్‌ఫుల్‌ బ్రీతింగ్ .ఇది ఎంతో సింపుల్‌.పైగా దీని ద్వారా పొందే ప్రయోజనాలు కూడా ఎక్కువే.

Advertisement

నిత్యం పది నిమిషాలు బ్రీతింగ్ సాధన చేయాలి.ఇది చేసేటప్పుడు మీపై, మీ ఊపిరిపై పూర్తిగా దృష్టి పెట్టి ఏకాగ్రతతో చేయాలి.

దీన్ని మీరుండే హోటల్‌ రూములో.బీచ్‌లో, కొండల మధ్య , పచ్చని ప్రకృతి నడుమ ఎక్కడైనా చేయొచ్చు.

ఇది చేసేటప్పుడు ముక్కు ద్వారా గాలిని లోతుకంటా పీల్చుకుని వదలాలి.వెలుగుతున్న కొవ్వొత్తిని ఏకాగ్రంగా చూడడం మరో ప్రక్రియ.

ఇలా చేయడం వల్ల పనిపై ఏకాగ్రంగా దృష్టి పెట్టగలరు.ఈ ప్రక్రియ చేసేటప్పుడు కాంతి తక్కువగా ఉన్న గదిలో కూర్చోవాలి.

హీరో, విలన్ పాత్రలు ఒక్కరే పోషించిన తెలుగు సినిమాలేంటో తెలుసా?

కొద్దిసేపైన తర్వాత కొవ్వొత్తిని వెలిగించి శ్వాసను లోతుకంటా పీలుస్తూ కాంతులు వెదజల్లుతున్న ఆ కొవ్వొత్తి వైపే ఏకాగ్రంగా చూడాలి.మూడవది యోగనిద్ర.

Advertisement

అదే శవాసనం.దీని వల్ల కూడా మనసు, శరీరం బాగా రిలాక్సు అవుతాయి.

ఇది చేసేటప్పుడు శరీరంలోని ప్రతి అంగంపైనా 15-20 సెకన్లపాటు దృష్టి కేంద్రీకరించాలి.ఇలా చేయడం వల్ల శరీరమంతా ఎంతో తేలిక అవడమే కాకుండా ఎంతో రిలాక్సింగా ఫీలవుతారు.

ఆ రిలాక్సింగ్‌ స్థితి నుంచి మెల్లగా సాధారణ స్థితికి రావాలి.శవాసన స్థితిలో ఉన్నప్పుడు కొందరు నిద్రపోతారు.

అది కూడా మంచిదే.అలా నిద్రపోవడం వల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభించి సాధారణ స్థితికి వచ్చినపుడు మరింత ఉత్సాహంగా ఉంటారు.

అందుకే ఎక్కువ శ్రమవలన ఒత్తిడికి లోనవుతున్న వారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఫ్యామిలీ తో ట్రిప్స్ వేసినప్పుడు కానీ ఇలాంటి పద్ధతుల్ని పాటిస్తే మానసికంగా,ఆరోగ్య పరంగా చాలా ధృడంగా ఉంటారు అని చెప్తున్నారు వైద్యులు.

తాజా వార్తలు