బూతు సినిమా వదిలేసినందుకు యంగ్ హీరో హ్యాపీ

ఈ టాలివుడ్ యంగ్ హీరో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.సినిమాలు లేట్ గా తీస్తాడు కాని, రోటీన్ గా అయితే వెళ్ళడు.

కెరీర్ మొదట్లోనే హిట్ కొట్టి ఆ తరువాత నెమ్మదించిన ఈ కుర్ర హీరో ఓ బడా ఫ్యామిలిలో మెంబర్.అందుకే ఓ బాలివుడ్ సినిమా ఆఫర్ వచ్చినా వదిలేసుకున్నాడు.

అదేం వెర్రితనం అని అనుకోకండి, అదో బూతు సినిమా లేండి.హాట్ సినిమా అయితే ఏం, హీరోకి ఏం ఇబ్బంది అని అనుకుంటున్నారా? ఎలా చేస్తాడండి ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ పెట్టుకోని.ఆ హీరోకి ఇబ్బంది లేకపోయినా, ఆ బడా ఫ్యామిలి అభిమానులకి ఇబ్బందే కదా.అందుకే వదిలేసుకున్నాడు.మొదట్లో బాలివుడ్ ఆఫర్ వదిలేసా ఏంటి అని కొద్దిగా ఆలోచించినా, మొన్న ఆ సినిమా ట్రైలర్ చూసి హమ్మయ్య, వదిలేసి మంచి పని చేసా అని ఊపిరి పీల్చుకున్నాడట.

కొన్ని తెలుగు సినిమాలు చేసిన ఓ హీరోయిన్ ఈ సినిమాలో నటించింది.ట్రైలర్ చూసిన జనాలు సన్నివేశాలు కొంచెం వల్గర్ గానే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.ఆ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఈ హీరో చేసుంటే, పెద్ద రచ్చే జరిగేది.

ఏదైతే ఏం .ఆ సినిమా ఒప్పుకోలేదు మన హీరో.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?

తాజా వార్తలు