YV Subbareddy : తాడేపల్లిగూడెం సభలో పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి..!!

తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన "జెండా" సభ( Jenda sabha ) ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఈ సభలో పవన్ కళ్యాణ్.

సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్( CM Jagan ) ని అధ్థఃపాతాళంలోకి తొక్కేస్తానని.

మండిపడ్డారు.దీంతో పవన్( pawan ) చేసిన వ్యాఖ్యలపై వైవి సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీని అధ్థఃపాతాళంలోకి తొక్క మనండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు.రాజకీయం అంటే సినిమాలో డైలాగులు  చెప్పినంత ఈజీ కాదు అని పేర్కొన్నారు.

Advertisement
Yv Subbareddy Gave A Counter On Pawan Kalyan Comments In Tadepalligudem Sabha-Y

వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి సమయం పడుతుందని విమర్శించారు.వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జరిగేది క్లాస్ వార్.

క్యాస్ట్ వార్ కాదని పేర్కొన్నారు.

Yv Subbareddy Gave A Counter On Pawan Kalyan Comments In Tadepalligudem Sabha

ఎన్నికలలో వైసీపీకి అభ్యర్థులు లేక కాదు 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంలో భాగంగా మార్పులు చేసినట్టు స్పష్టం చేశారు.తమది చీటింగ్ కాదు జనసేన తెలుగుదేశం పార్టీది లూటీ టీం అని అన్నారు.ఇదే సమయంలో కాపులు అభివృద్ధిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లు స్పష్టం చేశారు.

అందులో భాగంగానే కాపులకు 25 కోట్ల రూపాయలు విలువ చేసే 50 సెంట్లు భూమిని విశాఖ నడిబొడ్డున ఇచ్చినట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూరేలా.

స‌మ్మ‌ర్‌లో రోజుకో గ్లాస్ ల‌స్సీ తాగితే..మ‌స్త్‌ బెనిఫిట్స్‌!

ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.బడుగు బలహీన వర్గాలకు పదవులలో పెద్దపీట వేసినట్లు తెలిపారు.

Advertisement

కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కులగణన చేపట్టినట్లు పేర్కొన్నారు.

కాపు బిడ్డకు ఎంపీగా పోటీ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారు.అని వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ) స్పష్టం చేశారు.

తాజా వార్తలు