కేంద్ర మంత్రిగా విజయసాయి..?

ఒక పక్క ఏపీ ప్రభుత్వం కేంద్రంతో పెద్ద సమరమే చేస్తోంది.

హోదా ఇస్తావా చస్తావా అని పట్టుబట్టి చివరకి బీజేపి అలసత్వాన్ని తట్టుకోలేక ఎన్డీయే నుంచీ బయటకి వచ్చేశారు.

తమ శక్తి యుక్తులు అన్ని కేంద్రంపై ప్రయోగిస్తూ ఒత్తిడి తీసుకురావాలని చూస్తుంటే వైసీపి ,బిజెపి లు మాత్రం కేంద్రంలో మంత్రి పదవులు సాధించేందుకు తమ శక్తి,యుక్తులను ధారబోస్తున్నారట.బిజెపితో పాటు.

ఆ పార్టీ రహస్యస్నేహితులైన వైకాపా నాయకులు కూడా మంత్రి పదవి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారట.రాష్ట్రానికి అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని అడుగుతుంటే వైసీపి వాళ్ళకి పదవులు కట్టబెట్టడానికి మోడీ తహతహ లాడుతున్నాడట.

బిజెపి నుంచి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, వైకాపా నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, నిన్న రాజ్యసభకు నామినేటెడ్‌ అయిన జివిఎల్‌ నర్సింహ్మారావులు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలాఉంటే బిజెపి కి చెందిన పురంధరేశ్వరి మాజీ మంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో ఆ పదవి నాకే దక్కాలి అని ప్రయత్నాలు చేసుకుంటోంది.

Advertisement

బిజెపి అభివృద్ధికి గత నాలుగేళ్ల నుంచి కృషి చేస్తున్నానని, తనను సేవలను వినియోగించుకోవాలని.రాబోయే ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తానని ఆమె హామీ ఇస్తున్నారట.

ఇక వైకాపాకు చెందిన విజయసాయిరెడ్డి కూడా పిఎంఒ చుట్టూ తిరుగుతూ.బిజెపికి మేలు చేస్తున్నానని.

తాను చేసిన సేవలకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారట.ఈ మధ్యనే రాజ్యసభకి ఎన్నికైన నర్సింహ్మారావుకు కూడా మంత్రిగా అవకాసం కోసం ఎదురు చూస్తున్నారట అయితే ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం వస్తుందో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు