వైసీపీ ఎమ్మెల్యే ల్లో టెన్షన్ ?  పీకే అంత భయపెడుతున్నాడా ? 

2024 ఎన్నికలకు చాలా సమయం ఉంది.

అయితే రాబోయే ఎన్నికల్లో సగం మంది ఎమ్మెల్యేలకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ టికెట్ ఇవ్వరు అనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.

దీనికి కారణం ప్రజల్లో బలం లేని వారు,  అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో విమర్శలు ఎదుర్కొంటున్న వారు, గెలిచే ఛాన్స్ లేనివారిని ముందుగానే గుర్తించి జగన్ పక్కన పెడతారని , వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతోంది.ప్రస్తుతం పార్టీలోనూ,  ప్రభుత్వంలోనూ జగన్ ఒక్కరే ఫోకస్  అవుతున్నారు.

ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వారి పాత్ర నామమాత్రమే అన్నట్లుగా ఉంది.  అన్ని సంక్షేమ పథకాలు అధికారుల ద్వారా సక్రమంగా అమలు అయిపోతూ ఉండడంతో, ఇక తన అవసరం ప్రజలకు ఏముంటుంది అన్నట్లుగా చాలా మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఉంది.

         దీనికి తోడు మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.వారంతా  నియోజకవర్గంలో కంటే, బయట ప్రాంతాల్లోనే ఎక్కువ గడుపుతున్నారు.

Advertisement
Ysrcp Mlas Tention On Prasanth Kishore Team Reports Ysrcp, Ysrcp Mlas, Prasanth

సొంత వ్యాపార వ్యవహారాలు మునిగితేలుతూ,  నియోజకవర్గాన్ని పట్టించుకోనట్లు గా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు చాలాకాలం నుంచి జగన్ కు అందుతూనే ఉన్నాయి .దీనికితోడు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ , గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కి ఈ పరిణామాలు మరింత బలపడేందుకు దోహదం చేస్తున్నాయి.

వీటన్నింటిపైనా జగన్ కు ఫిర్యాదులు అందుతున్నాయని జగన్ సీరియస్ గా ఉన్నారట.ఈమేరకు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ నిఘా వర్గాల ద్వారా నివేదిక ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు.   

Ysrcp Mlas Tention On Prasanth Kishore Team Reports Ysrcp, Ysrcp Mlas, Prasanth

     దీనికి తోడు ఏపీలో ఎమ్మెల్యేల పని తీరును,  ప్రజలు వారి బలం,  అవినీతి వ్యవహారాలపై సమగ్రంగా సర్వే నిర్వహిస్తుండడం , ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన నివేదికలు జగన్ కు చేరిపోతూ ఉండడంతో ఆయన మరింతగా అలెర్ట్అవుతున్నారు.వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు మొత్తం ప్రశాంత్ కిషోర్ టీం ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో జగన్ కు అందిస్తుండడడం, వాటి ఆధారంగానే జగన్ రాబోయే ఎన్నికల్లో టికెట కేటాయించే అవకాశం ఉండడం తదితర కారణాల తో ప్రశాంత్ కిషోర్  భయం వైసీపీ ఎమ్మెల్యేల్లో రోజురోజుకు పెరిగిపోతోందట.

ఈ పౌడ‌ర్‌ను వాడితే మ‌చ్చ‌లు త‌గ్గి చ‌ర్మం వైట్ & బ్రైట్‌గా మార‌డం ఖాయం!
Advertisement

తాజా వార్తలు