తనలోని నటుడుని బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అప్పుడప్పుడు రాజకీయ నాయకులు ముఖానికి రంగులు వేసుకొని తమలోని నటుడుని బయటకి తీసుకొస్తారు.వాళ్లకి ఉండే సరదాలు తీర్చుకుంటారు.

అలాగే నటులుగా ఉన్నవారు తరువాత రాజకీయాలలోకి వెళ్లి బిజీ అవుతారు.వైసీపీ ఎంపీగా ఉన్న భారత్ మార్గాని ఒక సినిమాలో హీరోగా నటించాడు.

YSRCP MLA Turns Into Tollywood Movie Artist, Tollywood, Telugu Cinema, South Cin

తరువాత రూట్ మార్చుకొని రాజకీయాలలో బిజీ అయిపోయాడు.అలాగే రంగస్థలంలో నాటకాలు చేసిన అనుభవం ఉన్నవారు తరువాత సొంత ప్రాంతాలలో రాజకీయాలలో బిజీగా ఉంటారు.

అలాగే స్వతహాగా కళాకారుడు అయిన వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఒక సినిమా కోసం చాలా కాలం తర్వాత నటుడుగా మారిపోయాడు.విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చిన్న వయసు నుంచి నటనపై ఆయనకు ఆసక్తి ఉంది.తన స్వగ్రామం కేజే పురంలో పలు నాటకాల్లో నటించి జనాల మన్ననలను పొందారు.2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు హైదరాబాదులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రను పోషించి అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి ప్రశంసలు అందుకున్నారు.ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేగా ప్రజా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజాగా మోదకొండమ్మ అనే సినిమాలో ధర్మశ్రీ నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గాజువాకలో జరుగుతోంది.

గిరిజనులు ఆరాధించే దైవం మోదకొండమ్మ.ఈ చిత్రంలో పరమశివుడికి, ఆయన తపస్సును భంగం చేయడానికి వచ్చిన మాంత్రికునికి మధ్య సన్నివేశాలను తాజాగా చిత్రీకరించారు.ఈ చిత్రంలో శివుడి పాత్రను ధర్మశ్రీ పోషిస్తున్నారు.

ఆ మధ్య ఓ సినిమా కోసం వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి పుష్పశ్రీవాణి టీచర్ పాత్రలో కనిపించింది.మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలు సినిమాల ద్వారా తమలోని నటులని ఇప్పుడు సరదాగా బయటకి తీసుకొస్తున్నారు.

ఖాళీ కడుపుతో జ్యూస్ తాగుతున్నారా?... ఈ విషయాలు తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు