కుటుంబ సిద్ధాంతితో వైఎస్ విజయమ్మ మరోసారి భేటీ

వైఎస్ఆర్ కుటుంబ సిద్ధాంతి అద్దెపల్లి హనుమంతరావుతో వైఎస్ విజయమ్మ మరోసారి భేటీ అయ్యారు.

ఈ మేరకు ఒంగోలుకు వెళ్లిన విజయమ్మ నిన్న సిద్ధాంతిని కలిసిన సంగతి తెలిసిందే.

ఈ సమావేశంలో భాగంగా సిద్ధాంతికి షర్మిల జాతకాన్ని రాత పూర్వకంగా అందించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నామినేషన్ వేసేందుకు మంచి ముహుర్తం కోసం చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఒంగోలుకు వెళ్లిన విజయమ్మ షర్మిల రాజకీయ భవిష్యత్ బాగుండాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.

దీంతో ఉదయం నుంచి సిద్ధాంతి హనుమంతరావు పూజలు చేస్తున్నారని సమాచారం.

Advertisement
Taxation Of Winnings — How Canadian Players Should Treat Casino And Blackjack Payouts At C Bet