బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రైతులు చనిపోతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిది వేల మంది రైతులను ప్రభుత్వం బలితీసుకుందని మండిపడ్డారు.ఓట్ల కోసమే బీఆర్ఎస్ రైతు నినాదమని విమర్శించారు.

ఇచ్చిన హామీ మేరకు చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.

ఐకేపీ సెంటర్లు తెరిచి తరుగు దోపిడీ ఆపాలని డిమాండ్ చేశారు.

Advertisement
నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?

తాజా వార్తలు