బెయిల్ రద్దవుతుందని అప్పుడు తెలియదా ? షర్మిల 

జగన్ షర్మిల మధ్య ఏర్పడిన ఆస్తులు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇప్పటికే లేఖలతో జగన్( Jagan ) షర్మిల( Sharmila ) మధ్య  యుద్ధం జరుగుతుండగా,  వైసిపి , టిడిపి నాయకులు ఈ వ్యవహారంలో విమర్శలు చేసుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా మరోసారి తన అన్న జగన్ ను ప్రశ్నిస్తూ షర్మిల కామెంట్స్ చేశారు.జగన్ బెయిల్ , షర్మిల ఆస్తుల పంపకాల వ్యవహారానికి సంబంధించి వైసిపి నేతలు చేస్తున్న విమర్శలపై షర్మిల ఘాటుగా స్పందించారు.

జగన్ బెయిల్ రద్దుకు కుట్ర గా ఆ పార్టీ నాయకులు పేర్కొనడం ఈ దశాబ్ధపు పెద్ద జోక్ అని షర్మిల అన్నారు. 

Ys Sharmila Comments On Jagan Bail Issue Details, Jagan, Sharmila, Ys Jagan, Ys

జగన్ తో ఆస్తులు వివాదం మరోసారి స్పందించిన షర్మిల అనేక కామెంట్స్ చేశారు. ఈడీ( ED ) అటాచ్ చేసింది షేర్లు కాదు. రూ.32 కోట్ల విలువైన కంపెనీ స్థిరాస్తి, షేర్ల బదలాయింపు పై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు.స్టేటస్ కో ఉన్నది షేర్ల పై కాదు.

Advertisement
Ys Sharmila Comments On Jagan Bail Issue Details, Jagan, Sharmila, Ys Jagan, Ys

గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడి అటాచ్ చేసింది.వాటికి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ బదిలీలు మాత్రం ఆపలేదు.

ఈడి అటాచ్ చేసినందు వల్ల షేర్ల బదిలీ( Shares Transfer ) చేయకూడదనడం హాస్యాస్పదం.నాకు 100% వాటాలు బదలాయిస్తామని ఎంవోయూపై జగన్ సంతకం చేశారు.

Ys Sharmila Comments On Jagan Bail Issue Details, Jagan, Sharmila, Ys Jagan, Ys

బెయిల్( Bail ) రద్దు అవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా ? 2021లో రూ 42 కోట్లకు క్లాసిక్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను విజయముకు ఎలా అమ్మారు ? బెయిల్ రద్దువుతోందని షేర్లు విక్రయించినప్పుడు తెలియదా ? అలా అమ్మడం స్టేటస్ కో ను ఉల్లంఘించినట్లు కాదా ? షేర్ల బదిలీకి బెయిల్ రద్దుకు సంబంధం లేదని మీకు తెలుసు.షేర్లు విక్రయించి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు.జగన్ బెయిల్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదని విజయమ్మకు( Vijayamma ) తెలుసు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు