టీడీపీని జగన్ ఎదుర్కోలేడా ..? కారణం ఇదేనా .. ?

పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఎప్పుడు సీఎం కుర్చీ ఎక్కేద్దామా అని తహలాడుతున్న వైసీపీ అధినేత జగన్ ఆశలు గత ఎన్నికల్లో అడియాసలు అయ్యాయి.

ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న జగన్ ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు తన కాళ్ళకు పనిచెప్పి మరీ పాదయాత్ర చేపడుతున్నాడు.

కానీ అధికార పార్టీ టీడీపీ మాత్రం కొంచెం రిలాక్స్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది.జగన్ ధీమా ఒక్కటే.

చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు తనను అధికారంలోకి తీసుకువస్తాయి అని జగన్ భావిస్తున్నాడు.ప్రజల్లోనూ జగన్ కు మంచి ఆదరణ ఉన్నట్టుగానే కనిపిస్తోంది.

Ys Jagan Too Weak In That Particulars

జగన్ ఎన్నికల కోసం అంత హైరానా పడుతుంటే బాబు మాత్రం ఇంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నాడు అనేదానికి సమాధానం కూడా ఉంది.అదేంటంటే .పోల్ మెనేజ్మెంట్‌.దీంట్లో చంద్రబాబుని మించిన వారు లేరనిధి రాజకీయ పండితులు అందరికి తెలుసు.

Advertisement
Ys Jagan Too Weak In That Particulars-టీడీపీని జగన్ ఎ

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా ఇదే విషయం తేలింది.అక్కడ వైసీపీ గెలుపు ఖాయం అని అంతా భావించినా .వైసీపీ అభ్యర్థి మాత్రం ఓటమి చవిచూశాడు.అంటే, బాబు పోల్ మెనేజ్మెంట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి.

మరి వచ్చే ఎలెక్షన్స్‌లో సీఎం కావాలని కలలు కంటున్న జగన్ పోల్ మెనేజ్మెంట్‌లో అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు మాత్రం కనిపించడంలేదు.దీనికి తోడు పార్టీపై ప్రజల్లో సానుభూతి ఉన్నా .నియోజకవర్గాల్లో ఎమ్యెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పుకునే నాయకుల్లో మాతరం అంత బలమైన అభ్యర్థులు కనిపించడంలేదు.దీనికి తోడు వైసీపీకి సంస్థగతంగా బలంగా లేదనే ఆరోపణలు ఉన్నాయి.2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే పార్టీని నడపడం జగన్ కు చాలా కష్టం అయిపోతుంది.పాదయాత్రకు వచ్చిన జనం అంతా ఓటు వేస్తారనే గ్యారంటీ అయితే వైసీపీకి లేదనే చెప్పాలి.

టీడీపీ విషయం అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.ఏ పార్టీకి లేనంత పటిష్టమైన సంస్థాగత నిర్మాణం ఆ పార్టీకి ఉంది.

అదే టీడీపీ కి ఎప్పుడూ కలిసొస్తుంది.అంతే కాకుండా గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం దృడంగా ఉంది.

వాటికి తోడు చంద్రబాబు ఐడియాలిజీ , పోల్ మేనేజ్మెంట్ లో బాబు ని మించినవారు లేరు.ఇలా ప్రతి విషయంలోనూ .ప్రతి అంశంలోనూ టీడీపీదే పై చేయి ఉండడం వైసీపీ శాపంగా మారింది.

Advertisement

తాజా వార్తలు