జగన్ చాలా అన్నాడు... పవన్ ఇప్పుడు ఏమంటాడు..

జగన్ చాలా దూకుడుగా ఉన్నాడు.రాబోయే ఎన్నికల్లో త్రిముఖపోరు తప్పేలా లేకపోవడం.

జనసేనతో వైసీపీ పొత్తు కుదుర్చుకునే ఛాన్స్ కనబడకపోవడంతో ఇక పవన్ విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తే కుదరదని, విమర్శలతో ఇక ఉక్కిరిబిక్కిరి చేయాల్సిందే అనుకున్నాడో ఏమో కానీ పవన్ వ్యక్తిగత విషయాలపై పూర్తిగా టార్గెట్ చేసుకున్నాడు.పవన్ ని అనరాని మాటలన్నీ మాట్లేడేసాడు.

అయితే ఇప్పుడు పవన్ రియాక్షన్ ఏంటనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

నాకు కొంచెం తిక్క ఉంది అంటూ సినిమాలో డైలాగులు చెప్పిన పవన్ నిజ జీవితంలోనూ కొంచెం అలాగే ప్రవర్తిస్తుంటారు.ఆయన వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తే.ఎక్కడ లేని కోపం వస్తుంది.

Advertisement

ఆ విషయం చాలా సందర్భాల్లో బయటపడింది.పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడే తన వ్యక్తిగత జీవితం, వివాహాల విషయంలో వచ్చిన విమర్శలకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.

వ్యక్తిగతంగా వెళ్లాలనుకుంటే.తానూ వ్యక్తిగతంగా వెళ్తానని ప్రతి ఒక్కరి జీవితాలను రోడ్డు మీద పెడతానంటూ ఆవేశంగా చెప్పారు.

తన నుంచి విడిపోయిన మహిళలు.ఎవరి జీవితాలు వారు బతుకుతున్నారని.

అనవసరంగా వారి జోలికెందుకెళ్తారని కూడా ప్రశ్నించారు.కానీ ఇప్పుడు జగన్ పవన్ కి నలుగురు వెళ్లాలని, కార్లు మార్చినట్టు పవన్ పెళ్లాలని మార్చుతాడు అంటూ వ్యాఖ్యానించడం పై పవన్ లా స్పందిస్తాడో తెలియదంల్డు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide

జగన్ విమర్శలను పవన్ కల్యాణ్ తన పార్టీ నేతల ద్వారా తెలుసుకున్నారు.ఆ తర్వాత వీడియోలు కూడా చూశారు.

Advertisement

ఎలా స్పందించాలన్నదానిపై.ఆయనకు ఆయనే ఆలోచించుకుటున్నారు.

సహజంగా.పవన్ కల్యాణ్‌కు కూడా ఇతరుల దగ్గర సలహాలు తీసుకునే అలవాటు లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

జగన్ విమర్శలపై స్పందించకపోతే ఓ బాధ, స్పందిస్తే.మరో ఇబ్బంది పవన్ కల్యాణ్‌కు ఎదురవుతుంది.

జగన్ విమర్శలపై స్పందించాలంటే.వారిపై మరిన్ని ఆరోపణలు చేయాలి.

ఇలా చేయడం వల్ల.మళ్ళీ వారు విమర్శిస్తారు.

ఇలా ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే.ఆ వివాదం పెద్దదై రాజకీయంగా ఇబ్బంది అవుతుందనే ఆలోచనలో పవన్ ఉన్నాడు.

కానీ పవన్ స్వభావం బట్టి చూస్తే.తన ప్రసంగాల్లో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా జగన్ కి కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండబోతోంది.