రామోజీరావు మృతిపై వైఎస్ జగన్ సంతాపం

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ( Ramoji Rao )మృతిపై వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జగన్ తెలిపారు.

తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా రామోజీరావు ఎనలేని సేవలను అందించారని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ఈ క్రమంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

రామోజీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జగన్ ట్వీట్ లో వెల్లడించారు.కాగా రామోజీరావు అస్తమయంపై ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు