యూట్యూబ్ క్రియేట్ వీడియో ఎడిటింగ్ యాప్.. ఇకపై వీడియో ఎడిటింగ్ ఫోన్లోనే..!

ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్( Youtube ) ఇకపై వీడియోలు పోస్ట్ చేసే యూజర్లు ఫోన్లోనే వీడియోలను ఎడిటింగ్ చేసుకునేందుకు వీలుగా కొత్త వీడియో ఎడిటింగ్ యాప్ ను తీసుకొస్తున్నట్లు తెలిపింది.

ఈ యాప్ ద్వారా సులభంగా వీడియోలను రూపొందించడంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్( AI ) ఆధారంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు.

ఆ సరికొత్త యాప్ కు సంబంధించిన ఫీచర్స్ ఏమిటో చూద్దాం.యూట్యూబ్ క్రియేట్( Youtube Create ) వీడియో ఎడిటింగ్ యాప్ లో ప్రిసిసన్ ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటో క్యాప్షన్, వాయిస్ ఓవర్ ఆప్షన్, లైబ్రరీ ఫిల్టర్, ట్రాన్స్షన్, ఎఫెక్ట్ లాంటి ఎన్నో ఫీచర్లు ఈ యాప్ లో ఉన్నాయి.

కొత్త వీడియోలను ఎడిటింగ్( Video Editing ) చేసి అదనపు హంగులు చేర్చడంలో భాగంగా ఉచిత మ్యూజిక్ సహా మరిన్ని ఫీచర్లు ఈ యాప్ లో జత చేయడం జరిగింది.ఈ యాప్ లోని ఫీచర్లతో చాలా సులభంగా వీడియోలను ఎడిటింగ్ చేయవచ్చు.

Youtube Launches Ai-enabled Editing App Youtube Create Details, Youtube ,ai-enab

ప్రస్తుతం యూట్యూబ్ క్రియేట్ వీడియో ఎడిటింగ్ యాప్ టెస్టింగ్ దశలో ఉంది.ఈ యాప్ ముందుగా ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.ముందుగా కొన్ని దేశాలలో యూట్యూబ్ క్రియేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ ను విడుదల చేస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది.

Advertisement
YouTube Launches AI-enabled Editing App YouTube Create Details, YouTube ,AI-enab

ఆ దేశాలలో భారత్ కూడా ఉంది.

Youtube Launches Ai-enabled Editing App Youtube Create Details, Youtube ,ai-enab

కాకపోతే ఈ యాప్ iOS వెర్షన్ వచ్చే సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉంది.వీడియో బ్యాక్ గ్రౌండ్ లను క్రియేట్ చేసే ఫీచర్ కూడా ఈ యాప్ లో ఉంది.డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ ద్వారా నచ్చిన వీడియోలు ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్ సృష్టించడానికి వినియోగదారులకు అనుమతి ఇస్తుంది.ప్రస్తుతం ఎంపిక చేసిన క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని యూట్యూబ్ తెలిపింది.2024 సంవత్సరంలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు