ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తమ ముఖ చర్మం( Face Skin ) అందంగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

అయితే అటువంటి చర్మాన్ని పొందడానికి కచ్చితంగా ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి.

ముఖ్యంగా హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి.కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడికి దూరంగా ఉండాలి.శరీరానికి శ్రమ ఉండాలే చూసుకోవాలి.

నిత్యం కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి.ఒంటికి సరిపడా నీటిని అందించాలి.

Advertisement

ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ నైట్ క్రీమ్( Homemade Night Cream ) చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను మీ సొంతం చేస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టమాటో స్లైసెస్,( Tomato Slices ) ఐదారు క్యారెట్ స్లైసెస్( Carrot Slices ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి స్టైనర్ సహాయంతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు టమాటో క్యారెట్ జ్యూస్, హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ఆరోజే పెళ్లి బాజాలు మోగనున్నాయా?
చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?

నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.నిత్యం ఈ నైట్ క్రీమ్ ను ఉపయోగించడం వల్ల స్కిన్ సూపర్ బ్రైట్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.

Advertisement

టమాటో మరియు క్యారెట్ లో ఉండే విటమిన్లు చర్మంపై మొండి మచ్చలను తగ్గిస్తాయి.పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేసి స్కిన్ కలర్ ను ఈవెన్ గా మారుస్తాయి.

ఈ నైట్ క్రీమ్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ ఏజింగ్‌ ఆలస్యం అవుతుంది.అంటే ముడతలు, చారలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.

చర్మం యవ్వనంగా మెరుస్తుంది.పైగా ఈ క్రీమ్ సన్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది.

చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది.

తాజా వార్తలు