యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) కొన్నిరోజుల క్రితం 40వ ఒడిలోకి అడుగుపెట్టారు.
సౌత్ ఇండియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్ది మంది హీరోలలో తారక్ ఒకరు కాగా చిన్న వయస్సులోనే సంచలన విజయాలను సొంతం చేసుకున్న ఈ హీరో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు.
అయితే ఈ మధ్య కాలంలో తారక్ పై నెగిటివిటీ సోషల్ మీడియాలో పెరుగుతోంది.ఏదైనా తప్పు చేస్తే సోషల్ మీడియా( Social media )లో నెగిటివిటీ పెరగడంలో ఆశ్చర్యం లేదు.
అయితే విచిత్రం ఏంటంటే ఎలాంటి తప్పు చేయకపోయినా తారక్ పై నెగిటివ్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.నందమూరి కుటుంబానికి చెందిన అగ్ర హీరో ఒకరు తారక్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రావడం ఇష్టం లేదనే విధంగా సంకేతాలు పంపడంతో తారక్, కళ్యాణ్ రామ్ ఆ ఈవెంట్ ను స్కిప్ చేశారని ఇండస్ట్రీలో టాక్.
నందమూరి కుటుంబంలోని హీరోల మధ్య సత్సంబంధాలు లేవు.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే విషయంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.అయితే టీడీపీ ముఖ్య నేతలు కోరే వరకు రాజకీయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసే ఆలోచన తారక్ కు లేదు.
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని రాజకీయాల గురించి ఎలాంటి కామెంట్లు చేయనని తారక్ పలు సందర్భాల్లో చెప్పారు.
కనీసం పుట్టినరోజును కూడా ప్రశాంతంగా జరుపుకోలేని స్థితికి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం ఆలోచించాలి. సింహాద్రి( Simhadri ) మూవీ కలెక్షన్ల విషయంలో కొంతమంది కావాలని చేస్తున్న నెగిటివ్ ప్రచారం అంతాఇంతా కాదు.తారక్ నోరు మెదిపి తనకు జరిగిన అవమానాల గురించి చెబితే పోయేది ఎవరి పరువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే తారక్ అంత పైకి ఎదుగుతారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy