ఉదయ్ కిరణ్ తరుణ్ లాగే చేస్తున్న యంగ్ హీరోలు...

సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది గాడ్ ఫాదర్( godfather ) లు ఉన్న కూడా మనకు టాలెంట్ లేకపోతే ఎవ్వరూ ఏమి చెయ్యలేరు ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ కూడా తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

నిజానికి ఇండస్ట్రీ లో ఉన్న హీరోల్లో చాలా మంది యంగ్ హీరోలు మంచి టాలెంట్ ఉన్న కూడా సక్సెస్ లు లేక చాలా వరకు వెనకబడి పోతున్నారు.

అలాంటి హీరోలు చాలా మంది ఇండస్ట్రీ లో ఉన్న కూడా ముఖ్యంగా మంచి సినిమాలు తీయడం లో మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు.ఒకప్పుడు యంగ్ హీరోలు( Young heroes ) గా ఉన్న ఉదయ్ కిరణ్ తరుణ్ లాంటి హీరోలు అప్పుడు వాళ్లు చేసిన సినిమాలు యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి.

కానీ ఇప్పుడు అలాంటి హీరోలు ఒక్కరూ కూడా కనిపించడం లేదు వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ సక్సెస్ లు మాత్రం చాలా తక్కువ గా వస్తున్నాయి నిజానికి తరుణ్ ఉదయ్ కిరణ్( Uday Kiran ) ఇద్దరు ఒక టైం లో మంచి పీక్ స్టేజ్ లో ఉన్నారు అలాంటి వాళ్ళు అనుకోకుండా ఫేడ్ అవుట్ అయిపోవడం తర్వాత వాళ్ళు ఎంచుకున్న సినిమాల మీద బేస్ అయి ఉంటుంది.

ఇక ప్రస్తుతం వీళ్ళ లాగానే ఇండస్ట్రీ కి వచ్చి వరుసగా సక్సెస్ లు కొట్టి ఆ తర్వాత ఇప్పుడు ఫ్లాప్ లు అందుకుంటున్న హీరో రాజ్ తరుణ్( Raj Tarun ) ఈయన మొదట్లో మంచి హిట్ సినిమాలు తీసినప్పటికి ఆ తర్వాత చేసిన సినిమా వరుసగా ప్లాప్ అవుతున్నాయి ఇప్పుడు కూడా ఏవో సినిమాలు చేసినట్టు అనిపిస్తున్నప్పటికి అవి పెద్దగా సక్సెస్ అయితే అవుతాయి అనే నమ్మకం ఎవరిలో లేదు.

Advertisement

అయితే కెరియర్ లో ప్లాప్ లు అనేవి కామన్ గా వస్తాయి కాని అలాంటి టైం లో ప్లాప్ లు ఎందుకు వస్తున్నాయి మనం చేసే సినిమాల్లో లోపం ఎక్కడ ఉంది అనే విషయాలను తెలుసుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది అంతే కానీ ఆఫర్ వచ్చింది కదా అని చేస్తే ఇలానే ఉంటుంది.ఒక్క రాజ్ తరుణ్ మాత్రమే ఇలా చేస్తున్నాడు అని చెప్పట్లేదు ఈ జనరేషన్ లో ఉన్న యంగ్ హీరో లు అయిన కిరణ్ అబ్బవరం,ఆది సాయికుమార్,సంతోష్ శోభన్ లాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాలు చేస్తూ ప్లాప్ లను ముటకట్టుకుంటున్నారు.బయట మార్కెట్ లో టాలెంట్ ఉండి సినిమా డైరెక్షన్ ఆఫర్స్ ఇచ్చే వాళ్ళు లేక స్టోరీ లు పట్టుకొని ఒక్క ఛాన్స్ కోసం అందరి హీరోల చుట్టూ, ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు.

అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మంచి సినిమాలు తీసి పెడతారు కదా అంటూ సిని పెద్దలు కూడా ఈ యంగ్ హీరోల మీద కాస్త కోపం గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు