ఆ హీరోయిన్ కి అంత పొగరా !

ముంబై నుంచి వచ్చింది ఆ కుర్ర హీరోయిన్.సినిమాల్లోకి రాకముందు కూడా అమ్మడు బాగా పాపులరే.

అయితే హిందీలో మాత్రం అవకాశాలు ఇచ్చేవారు కరువు.అందుకే తెలుగు సినిమాలో ప్రయత్నాలు మొదలుపెట్టింది.

మొదటి సినిమా పెద్ద ఫ్లాప్, రెండోవ సినిమా భారి డిజాస్టర్.ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా ఈ హీరోయిన్ సెట్లో చేసే ఓవర్యాక్షన్ గురించి చాలా మాట్లాడుకున్నారు ఫిలింనగర్ ప్రజలు.

చెప్పిన టైంకి ఒకసారి వస్తే, మరోసారి రాదట.మిగితా హీరోయిన్లు తల్లినో, తండ్రినో వెంటబెట్టుకొని వస్తారు.

Advertisement

కాని ఈ హీరోయిన్ ఏకంగా బాయ్ ఫ్రెండ్ ని ఏసుకొని సెట్లోకి వచ్చేస్తుంది.షాట్ గ్యాప్ లో ప్రేమికుడితో కబుర్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది.

మళ్ళి షాట్ రెడి అవగానే త్వరగా వస్తుందా అంటే .రాదు.బాయ్ ఫ్రెండ్ తో కబుర్లు మధ్యలో ఆపి రావడం కష్టమే కదా.మొత్తానికి ఒక హిట్ కొట్టేసింది.ఫ్లాపుల్లో ఉన్నప్పుడే ఈ అమ్మాయికి ఇంత పొగరు ఉంటే, ఇప్పుడు హిట్ దొరికింది కదా, ఇకనుంచి ఇంకా ఏ రేంజిలో బిల్డప్పులు కొడుతుందో, యూనిట్ వాళ్లకి ఇంకెన్ని చుక్కలు చూపిస్తుందో అని గుసగుసలాడుకుంటున్నారు సినిజనాలు.

ఏం చేస్తాం .హిందీ అమ్మాయి.ఇక్కడ ఎలా మెదలాలో సరిగా తెలియదో లేక తెలిసి కూడా అలా ప్రవర్తిస్తుందో.

ఏమి అనలేకపోతున్నారు దర్శకనిర్మాతలు.

Advertisement