పెరుగులో పంచదార కలుపుకొని తింటున్నారా.. అయితే ఇది మీకోసమే..

పెరుగు శరీరానికి ఎంతో మేలు చేస్తుందనీ చాలామంది ప్రజలకు తెలుసు.ఎందుకంటే పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్ మరియు విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.

అంతేకాకుండా పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థతోపాటు ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.కానీ చాలామంది పెరుగులో చక్కెర కలిపి తినడానికి ఇష్టపడుతుంటారు.

అయితే పెరుగులో పంచదార కలిపితే మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని మరియు అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో సహజమైన తీపి ఉంటుంది.ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.మరో వైపు మీరు పెరుగు లో పంచదార ను ఎక్కువగా తింటే అది మీ ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

Advertisement

పెరుగుతో పంచదార తినడం వల్ల కలిగే అనర్ధాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి రోజూ పంచదార కలిపిన పెరుగు తింటే మీ దంతాలలో క్యావిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది.

ఎందుకంటే చక్కెర దంతక్షయాన్ని కలిగిస్తుంది.అలాంటప్పుడు పెరుగులో చక్కెర కలిపి తింటే పంటి నొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి పంచదార పెరుగు తినడం వదిలేయడమే మంచిది.పెరుగులో పంచదార కలిపి తింటే గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.ఎందుకంటే చక్కెరలో చాలా కేలరీలు ఉంటాయి.

ఇది మీ రక్తపోటును పెంచుతుంది.దీని కారణంగా మీ గుండె జబ్బుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

కాబట్టి మీరు పెరుగు మరియు చక్కెరను తినే అలవాటు ఉంటే వెంటనే ఆ అలవాటును దూరం చేసుకోవాడం మంచిది.పెరుగును పంచదారతో కలిపి తీసుకుంటే మీ రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

Advertisement

ఇలా ప్రతి రోజు తింటే మధుమేహం సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది.

తాజా వార్తలు