రామంచంద్రన్‌ను అలా పిలిచే ఏకైక నటి భానుమతి.. షావుకారి జానకితో షూట్‌ మధ్యలోనే..

అలనాటి మేటి నటి భానుమతి మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, ప్రొడ్యూసర్, నావెలిస్ట్, యాక్ట్రెస్, లిరిసిస్ట్ ఇలా అన్ని రోల్స్ ప్లే చేసి ఫిమేల్ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమాగా పేరుగాంచింది భానుమతి.

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో ప్రేక్షకుల విశేషాదరణ పొందింది సీనియర్ నటి భానుమతి.ఆమె సినిమా షూటింగ్ కోసం సెట్‌కు వస్తే సెట్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేదట.

ఇకపోతే పెద్ద హీరోలు సైతం ఆమెకు విష్ చేసేవారు.షూట్ అయిపోయాక అందరూ మాట్లాడుకుంటుంటే భానుమతి మాత్రం దూరంగా కూర్చొని పుస్తకం చదవడమో లేదా కథలు రాసుకునేది.

ఇకపోతే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు ఎంజీ రామచంద్రన్‌ను భానుమతి ఏమని పిలిచేవారంటే.రామచంద్రన్‌ను వెండితెరపైన కథనాయకుడిగానే నిజజీవితంలోనూ నాయకుడిగా నిలిచారు.

Advertisement

ఆయన అంటే అప్పట్లోనే ప్రొడ్యూసర్స్ చాలా గౌరవమివ్వడంతో పాటు భయపడేవారు.ఎంజీఆర్ ముందర మాట్లాడాలంటే ఇబ్బంది పడేవారు.

అయితే, నటి భానుమతి మాత్రం అలా కాదు.ఎంజీ రామచంద్రన్‌ను డైరెక్ట్‌గా ‘మిస్టర్ రామచంద్రన్’ అని పిలిచేది.

అలా ఆయన్ను పిలవగలిగిన ఏకైక నటి భానుమతి కావడం విశేషమనే చెప్పొచ్చు.తన భర్త రామకృష్ణను కూడా భానుమతి రామకృష్ణగారు అని పిలిచేవారు.

ఇకపోతే పెద్ద హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ పక్కన మీరు బాగా యాక్ట్ చేశారని అభిమానులు చెప్తే ఊరుకునేది కాదు.లేదు వాళ్లే నాతో కలిసి నటించారు అని చెప్పేవారు భానుమతి.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
ఆ విషయంలో చిరంజీవి బాలకృష్ణ సేమ్ టూ సేమ్.. బాబీ కామెంట్స్ వైరల్!

ఇకపోతే ‘అన్నె’ అనే తమిళ చిత్రంలో భానమతి అక్కగా షావుకారి జానకి చెల్లెలుగా నటించారు.

Advertisement

ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఇద్దరు కలిసి నటించాలి.ఈ క్రమంలోనే దర్శకులు సీన్ ప్లాన్ చేశారు.అయితే, సీన్ జరుగుతున్న సందర్భంలో షావుకారి జానకి నటనను మూవీ యూనిట్ సభ్యులు అభినందిస్తున్నారు.

ఎందుకోగాని భానుమతి పర్ఫార్మ్ చేయలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో భానుమతి తనకు తలనొప్పిగా ఉందని చెప్పి వెంటనే ప్యాక్ అప్ చెప్పి వెళ్లిపోయారు.

అలా షూట్ మధ్యలోనే ప్యాకప్ చెప్పి వెళ్లిపోవడంతో మూవీ యూనిట్ సభ్యులు భయపడిపోయారట.ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు విడిగా భానుమతితో సీన్ తీశారు మూవీ యూనిట్ సభ్యులు.

తాజా వార్తలు