ఈ ముందు జాగ్ర‌త్త‌లో తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు.. తెలుసా?

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.జెనెటిక్(Genetic) ప్రభావం మాత్రమే ఇందుకు కారణమని అనుకుంటారు.

కానీ విటమిన్ల లోపం, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం ఇలా రకరకాల కారణాల వల్ల కూడా ఎర్లీ ఏజ్ లోనే వైట్ హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది.అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

విట‌మిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్, బయోటిన్, విటమిన్ డి వంటి పోష‌కాల కొర‌త త‌క్కువ ఏజ్ లోనే తెల్ల జుట్టు(White hair) రావ‌డానికి కార‌ణం.అందువ‌ల్ల ఆయా పోష‌కాల కోసం గుడ్లు, ఆకుకూరలు, బాదం, ఉల్లిపాయలు, మొలకెత్తిన విత్త‌నాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.

తెల్ల జుట్టు స‌మ‌స్య‌కు దూరంగా ఉండాలనుకుంటే అధిక రసాయనాలు కలిగిన షాంపూలు, హెయిర్ డై (Shampoos, hair dye)వాడకాన్ని తగ్గించండి.వీలైనంత వ‌ర‌కు ఒత్తిడికి దూరంగా ఉండండి.

Advertisement

ధ్యానం, యోగా, మెడిటేషన్, సరైన నిద్ర ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవ‌చ్చు.

వారానికి క‌చ్చితంగా రెండు నుంచి మూడు సార్లు ఆముదం, నల్ల నువ్వుల నూనె, బృంగరాజ్ ఆయిల్ (Castor oil, black sesame oil, bhringraj oil)లేదా కొబ్బరి నూనెను స్పాల్ప్ మ‌రియు హెయిర్ కు ప‌ట్టించి మంచిగా మసాజ్ చేసుకోండి.ఈ ఆయిల్స్‌ జుట్టు ఆరోగ్యాన్ని పోషిస్తాయి.ఎర్లీ ఏజ్‌లో వైట్ హెయిర్ వ‌చ్చే రిస్క్ ను త‌గ్గిస్తాయి.

అలాగే ధూమపానం మ‌రియు మద్యం నివారించండి.ఇవి ఒత్తిడిని పెంచడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ఉసిరి, క‌రివేపాకు వేసి మ‌రిగించిన కొబ్బ‌రి నూనె తెల్ల జుట్టు రాకుండా అడ్డుకోవ‌డంలో, జుట్టు రాల‌డాన్ని నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అలాగే రోజుకు ఒక ఉసిరి కాయ‌ను నేరుగా తిన‌డం అల‌వాటు చేసుకోండి.ఉసిరిని తిన‌డం వ‌ల్ల జుట్టుకు చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

జుట్టు ఆరోగ్యం మెరుగ‌ప‌డుతుంది.తెల్ల జుట్టు రాకుండా సైతం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు