Addanaki Siddham meeting : అద్దంకిలో వైసీపీ ‘సిద్ధం’ సభకు ఉప్పెనలా కదం తొక్కిన జనం

జగనన్నను మరోసారి గెలిపించుకోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారనడానికి ‘సిద్ధం’ సభ( Siddham meeting )ను చూస్తే అర్థం అవుతుంది.

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం( Addanki Assembly constituency )లోని మేదరమెట్ల ‘సిద్ధం’ సభకు జనవాహిని తరలివచ్చింది.

జగన్.జనం కలిస్తే ప్రభంజనమేనని రుజువైంది.

ఎక్కడా కనివీని ఎరుగని రీతిలో సుమారు 15 లక్షల మంది సభకు హాజరయ్యారు.ఏపీలో త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) ‘సిద్ధం’ పేరిట ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మేదరమెట్లలో నిర్వహించిన ‘సిద్ధం’ సభ విజయవంతం అయింది.

Advertisement

గతంలో నిర్వహించిన మూడు సభలకు మించి ఈ సభకు 15 లక్షల మంది హాజరయ్యారు.పెత్తందారులతో వైసీపీ చేస్తున్న యుద్ధానికి తాము సైతం సిద్ధమని గళమెత్తి చెప్పారు.

రాజకీయ దుష్టులు మూకుమ్మడిగా వస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.ఇందులో భాగంగానే సిద్ధం పేరిట సభలను నిర్వహించారు.ఈ మేరకు తొలి సభను ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన విశాఖలోని భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు.

కురుక్షేత్రంలో అర్జునుడి తరహాలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.రెండవ సభను ఉభయగోదావరి జిల్లాల్లోని దెందులూరులో నిర్వహించగా.సుమారు 50 నియోజకవర్గాలకు చెందిన పార్టీ క్యాడర్ హాజరైంది.

తరువాత అనంతపురం జిల్లాలోని రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ జనసముద్రంలా మారింది.ఇక ఆఖరి సభను అద్దంకి నియోజకవర్గంలో నిర్వహించగా లక్షల మంది తరలివచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ఉప్పెన వచ్చినట్లుగా సిద్ధం సభకు వచ్చిన జనసంద్రాన్ని చూస్తుంటే మహా సముద్రంలా కనిపిస్తోందని సీఎం జగన్ అన్నారు.పేదల ఆత్మగౌరవంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే దిశగా మరో ఐదేళ్ల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు.

Advertisement

మద్ధతు పలికేందుకు వచ్చిన ఆశేష ప్రజావాహినికి సెల్యూట్ చెప్పారు.అతి త్వరలోనే జరగబోతున్న మహా సంగ్రామం నేపథ్యంలో పేదలకు అండగా నిలిచేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు.

మంచి చేస్తున్న జగన్ ను ఓడించేందుకు రాకాసి మూకలన్నీ ఏకమై వస్తున్నాయని సీఎం జగన్ అన్నారు.తనకు చంద్రబాబుకు ఉన్నట్లుగా పొలిటికల్ స్టార్స్ లేరని చెప్పారు.అబద్ధాలకు రంగు పూసే బ్యాచ్ లేదన్నారు.

అలాగే వారి లాగా తనకు ఎలాంటి పొత్తులు లేవని పేర్కొన్నారు.తనకు ఉన్నదల్లా పేదంటి స్టార్ క్యాంపెయినర్లని స్పష్టం చేశారు.

చంద్రబాబు కూటమి( Chandrababu naidu )లో 3 పార్టీలు, జేబులో మరో జాతీయ పార్టీ ఇంకా మరి కొందరు ఉన్నారు.చంద్రబాబు సైకిల్ కు తుప్పు పట్టిందన్న సీఎం జగన్ ఏపీలో తన సైకిల్ తిరగడం లేదని దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా ఢిల్లీలో మోకరిల్లాడని విమర్శించారు.జగన్ మ్యానిఫెస్టోలో చెప్పింది చేయకపోయి ఉంటే చంద్రబాబు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు ఆరాటపడుతున్నాడని ప్రశ్నించారు.

జగన్ మార్క్ ఏపీలో కనిపిస్తుందని తెలిపారు.ఇంటింటికీ మంచి చేశామన్న మార్క్ ఉందన్నారు.

వీటన్నంటికీ మించి రాష్ట్రంలోని ప్రజలపై నమ్మకం ఉందన్నారు.ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు.వైసీపీ హయాం( YCP )లో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మంచి చేశామన్నారు.

దేవుని దయ, ప్రజల దీవెనలతో ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ అనే నేను మీ సేవకుడిగా సిద్ధమని స్పష్టం చేశారు.

తాజా వార్తలు